గన్నవరం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ నుండి ప్రత్యేక వాయుసేన విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్,ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తదితరులు స్వాగతం పలికారు. మంగళగిరి ఎయిమ్స్లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రపతి వచ్చారు.