YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయసాయి రెడ్డిపై పోరాడుతున్నందుకు బదిలీ చేయించారు!

విజయసాయి రెడ్డిపై పోరాడుతున్నందుకు బదిలీ చేయించారు!

అమరావతి
ఎంపి విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకొని విశాఖపట్నంలో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని, ఆయన అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకు తనను ఇటీవల హైదరాబాద్ నుంచి కోల్ కతాకు బదిలీ చేయించారని సస్పెన్షన్ కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఉండవల్లి నివాసంలో ప్రజాదర్బార్ కు విచ్చేసిన మదన్ మోహన్... మంత్రి లోకేష్ ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. నేను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ (ఐఐపి)లో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నాను. ఎంపి విజయసాయి రెడ్డి, అడ్వకేట్ సుభాష్ కలసి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖలో  ఆర్కే బీచ్ నుంచి భీమిలివరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారు. 2022-23 నడుమ నన్ను ఏమార్చి అమెరికా పంపిన ఎంపి విజయసాయి నా భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగబిడ్డను కన్నారు. తాను స్థానికంగా లేని సమయంలో బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రి అని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. తనకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రి డీజీపీలను కలిసి విన్నవించాను. ఇప్పటివరకు నాకు న్యాయం జరగలేదు. విజయసాయిరెడ్డికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి. గత ప్రభుత్వ హయాంలో శాంతి అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన కాలంలో రూ.20కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించింది. కుంచనపల్లిలో రూ.4కోట్ల విలువైన విల్లా, జగన్ ఇంటి సమీపంలో రూ.3కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర్ నగర్లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తోపాటు ఆమెకు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. విశాఖలో విజయసాయి, సుభాష్, తన భార్య శాంతి కలిసి కొట్టేసిన రూ.1500 కోట్ల భూములపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, విజయసాయి కుట్రతో కోల్ కతా బదిలీ అయిన తనను తిరిగి హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేయించాలని మదన్ మోహన్ విన్నవించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

Related Posts