న్యూఢిల్లీ, డిసెంబర్ 17,
ఇప్పుడు దేశంలో అంతటా ఒకే విషయంపై చర్చ సాగుతోంది. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఒకే దేశం - ఒకే ఎన్నికలు అనే అంశంపై చాలా రోజులుగా చర్చ సాగుతుండగా.. మంగళవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యాంగం (129సవరణ) బిల్లు 2024, కేంద్ర పాలిత చట్టాల (సవరణ) బిల్లు 2024 పెట్టాలని ప్రభుత్వం ముందుగా జాబితా చేసింది. కానీ ఆ తరువాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఒకటే బిల్లు ప్రవేశ పెట్టింది. దాని పేరులో సూచించినట్లుగా, ఇది దేశంలో ఎన్నికల గురించి చెబుతుంది. భారతదేశంలో, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, దేశంలోని లోక్‌సభ ఎన్నికలు, పౌర, పంచాయతీ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతాయి. అయితే దేశంలో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ, పౌర ఎన్నికలు జరగాలని మోదీ ప్రభుత్వం కోరుతోంది.వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు చాలా కాలంగా అధికార బీజేపీ అజెండాలో ఉంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను 14 మార్చి 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ప్రక్రియలో మార్పులు తీసుకురావచ్చని కమిటీ నివేదికలో పేర్కొంది.వన్ నేషన్, వన్ ఎలక్షన్ కోసం ఏర్పాటైన కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా , కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, చీఫ్ విజిలెన్స్ సభ్యులుగా ఉన్నారు. కమిషనర్‌గా సంజయ్ కొఠారీని చేర్చారు. దీంతో పాటు న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ నితేన్ చంద్రలను ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీలో చేర్చారు.ఈ కమిటీ తన నివేదికను సిద్ధం చేయడానికి ముందు, ఈ ప్రక్రియకు వర్తించేలా 191రోజుల పాటు 7 దేశాల ఎన్నికల ప్రక్రియను అధ్యయనం చేసింది. ఈ 7 దేశాల్లో స్వీడన్, బెల్జియం, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ ఉన్నాయి.కాంగ్రెస్ మొదటి నుంచి ఒకే దేశం, ఒకే ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపంలో పెనుమార్పు వస్తుందని అంటోంది. ఇది సమాఖ్య నిర్మాణానికి సంబంధించిన హామీకి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వాదిస్తోంది. కాంగ్రెస్ తో పాటు, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి మరికొన్ని పార్టీలు సైతం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.
బిల్లుకు టీడీపీ మద్దతు
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభ ముందు ఈ బిల్లును ఉంచారు. 129వ రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తూ ఆమోదించాలని చెప్పారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రకటించారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రక్రియ, పాలనలో స్పష్టత వస్తుందనే విషయం ఏపీలో చూశామన్నారు. ఇది మా అనుభవమని, దేశవ్యాప్తంగా ఇదే జరగాలని కోరుకుంటున్నామని అన్నారు.బిల్లును కాంగ్రెస్, ఎస్పీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ ఎంపీలు మనీష్ తివారీ, ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఇది రాజ్యాంగ స్ఫూర్తి విరుద్దమని విమర్శించారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఆప్ కూడా చెప్పేసింది. ఇది దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని అభిప్రాయపడ్డారు ఆ పార్టీ ఎంపీలు. దీన్ని ఇక్కడితే ముగిస్తే దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుటుందన్నారు. 8 రాష్ట్రాల్లో ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేని వారు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మాట్లాడుతున్నారని సమాజ్‌వాది పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. ఈ బిల్లు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను నాశనం చేస్తుందన్నారు. ముఖ్యనాయకుడి అహాన్ని సంతృప్తి పరచడానికే దీన్ని ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు.
ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఎంపీ సుప్రియా సూలే వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకించారు. ఇది సమాఖ్య వ్యవస్థపైనే దాడి అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికలను ఒకటి చేయడం సరికాదన్నారు.రాజస్థాన్‌కు చెందిన సీపీఎం ఎంపీ అమరారామ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకించారు.మిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తెలిపారు. దీన్ని తక్షణమే కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లు దారితీస్తుందన్నారు ఎస్పీ నేత ధర్మేంద్రయాదవ్. ఈ ఎన్నికలు నియంతృత్వానికి దారి తీస్తుందన్నారు.ఇది ముమ్మాటికీ రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమేనని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిదని, మనకు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదన్నారు. గతంలో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లును చర్చ లేకుండా చేసి ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారాయన. ఆ తర్వాత బిల్లును సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు.ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ఓటింగ్ నిర్వహించింది. బ్యాలెట్ విధానంలో ఓటింగ్‌ను ప్రవేశపెట్టారు స్పీకర్. మెజార్టీ సభ్యులు బిల్లుకు మద్దతు ఇచ్చారు. బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ తర్వాత మధ్యాహ్నం మూడుగంటలకు లోక్‌సభ వాయదా పడింది.జమిలి ఎన్నికల బిల్లు జేపీసీకి పంపడంపై కొత్త పార్లమెంటులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. ఎలక్ట్రానిక్ పద్దతిలో జరిగిన ఓటింగ్‌కు 369 ఎంపీలు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 220 మంది, వ్యతిరేకంగా 149 ఓట్లు వచ్చాయి. దీని తర్వాత వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుకు సుదీర్ఘంగా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగనుంది.ఈ బిల్లులో కీలకమైన అంశం మరొకటి ఉంది. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగి రెండేళ్ల తర్వాత ప్రభుత్వం కూలిపోతే, మిగిలిన మూడేళ్లకు తదుపరి ప్రభుత్వం ఉంటుందన్నారు. ప్రతీ ఐదేళ్లకు లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగడమే ప్రధానమైన పాయింట్.
బిల్లుకు జేడీయూ మద్దతు
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించాలని.. పంచాయతీ ఎన్నికలు వేర్వేరుగా జరగాలని మేము ఇంతకుముందు చెప్పాం. ఈ దేశంలో ఎన్నికలు ప్రారంభమైనప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండేది. 1967లో కాంగ్రెస్ రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది."
కాంగ్రెస్, బీజేపీపై శిరోమణి అకాలీదళ్ ఆగ్రహం
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ మాట్లాడుతూ.. "చర్చించాల్సిన అంశాలు చర్చకు రాకుండా పక్కదారి పట్టించేందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తెచ్చారు. సభను సక్రమంగా నడపాలని ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ కోరుకోవడం లేదు. ఎవరికి కావాల్సిన ఫీడ్ వాళ్లకు దొరుకుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నుంచి ఎవరికి ఉద్యోగాలు వస్తాయి?" అని ప్రశ్నించారు.