YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వాడీ వేడిగా అసెంబ్లీ.... భగ్గుమన్న భట్టి విక్రమార్క

వాడీ వేడిగా అసెంబ్లీ.... భగ్గుమన్న భట్టి విక్రమార్క

హైదరాబాద్, డిసెంబర్ 17, 
తెలంగాణ అసెంబ్లీ మంగళవారం వాడివేడిగా సాగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ భగ్గుమనడంతో, బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు సైతం సైలెంట్ అయ్యారు. ఈసారి భట్టి విక్రమార్క తనదైన శైలిలో విరుచుకు పడడంతో అసెంబ్లీ కామ్ గా కనిపించింది.రైతు కూలీల కోసం భూమి లేని వారికి ఏడాదికి రూ. 12 వేలు పథకంను ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ పథకం అమల్లోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ సర్కార్ అంతా సిద్దం చేస్తోంది. ఈ విషయాన్ని ఖమ్మం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మీరు రైతులకే పథకాలు వర్తింప జేస్తున్నారు, రైతు కూలీలకు ఏమి లేవా అనడంతో భట్టి ఖమ్మంలో ఏ మాట చెప్పాల్సి వచ్చింది. అయితే ఇదే విషయంపై బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు ప్రివిలేజ్ మోషన్ చేయాలంటూ గగ్గోలు పెట్టారు.ఈ విషయంపై స్పందించిన భట్టి విక్రమార్క మైక్ అందుకొని మాటలకు పదును పెట్టారు. ఏమి మీ భూస్వామ్య రాజ్యం, తట్టుకోలేక పోతున్నారా, రైతులతో పాటు కూలీలకు తాము పథకాలు ప్రవేశ పెడుతున్నామన్నారు. అది కూడా ఓర్వలేక బీఆర్ఎస్ పథకం అమలుకు అడ్డు తగిలేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుందన్నారు. అలాగే పదేళ్లు అప్పులు మిగిల్చి, ఇప్పుడు కాంగ్రెస్ సుపరిపాలన అందించడం ఏమాత్రం బీఆర్ఎస్ కు రుచించడం లేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ రూల్స్ బుక్ పై భట్టి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ రూల్స్ బుక్ ను ఇష్టారీతిన మార్చిందని, ఆ రూల్స్ ఇప్పటికీ అమలవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ప్లకార్డులు ప్రదర్శించరాదని రూల్స్ మార్చారని, కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ రూల్స్ పాటించడం లేదన్నారు.నాడు మీ స్వార్థం కోసం ఎన్ని మార్పులైనా చేస్తారు, నేడు ప్రభుత్వం మారితే అవి పాటించరా అంటూ భట్టి ప్రశ్నించారు. మొత్తం మీద మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భట్టి విక్రమార్క కాస్త సీరియస్ కామెంట్స్ చేశారని చెప్పవచ్చు. భట్టి మాట్లాడుతున్నంత సేపు బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు గప్ చుప్ కాగా, అసెంబ్లీ సైలెంట్ అయింది.

భట్టి వర్సెస్ హరీష్ రావు
తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో అధికార-విపక్షాల మాటల యుద్ధం సాగింది. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే అప్పులపై చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మాటపై కౌంటరిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
గ్లోబెల్ ప్రచారం చేస్తున్నామన్న మాటలపై మండిపడ్డారు. క్వశ్చన్ అవర్ వేస్టు చేయడం కరెక్టు కాదన్నారు. వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు డిప్యూటీ సీఎం. రూల్స్ బుక్ బీఆర్ఎస్ హయాంలో తయారు చేశారన్నారు. వారి తీసుకొచ్చిన రూల్స్‌బుక్‌నే తాము అమలు చేస్తున్నామన్నారు.సభా నిబంధనలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉల్లఘించారని ఆరోపించారు డిప్యూటీ సీఎం. సభలో మీరిచ్చిన హామీలు ఏంటని అమలు చేశారని ఏకిపారేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ? డబుల్ బెడ్రూమ్ ఎవరికిచ్చారు? ఉద్యోగాలు ఎక్కడ అంటూ ఎదురుదాడికి దిగారు.సభ‌కు సంబంధించిన అంశాలు బయటకు మాట్లాడకూడదంటూ చెప్పడాన్ని తప్పుబట్టారాయన. అప్పులపై ప్రశ్న అడిగితే ఏడు లక్షల పైబడి ఉన్నాయని తాము చెప్పామని అన్నారు. దీనిపై చర్చకు తాము రెడీ అని అన్నారు. ఇదేక్రమంలో బీఏసీ సమావేశంలో జరిగిన కొన్ని విషయాలు బయటపెట్టారు విక్రమార్క.శాసనసభకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని బీఆర్ఎస్ సభ్యులు శాసించినట్లు సభ నడవాలంటే కుదరదన్నారు. నిబంధనల ప్రకారమే అందరూ నడుచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సభలో నినాదాలు చేస్తూ ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ హంగామా చేయడం సరికాదన్నారు.బీఏసీ సమావేశంలో స్పీకర్‌ను బీఆర్ఎస్ అవమానించి.. పేపర్లు పడేసి వెళ్లిపోయారని ఆగ్రహించారు. స్పీకర్ అంటే బీఆర్ఎస్ నేతలకు గౌరవం లేదని మండిపడ్డారు. మాట్లాడితే సభాపతిపై ఎటాక్ చేయడం సరికాదన్నారు. ఇదే క్రమంలో హరీష్‌రావు మాటలపై స్పీకర్ నోరెత్తారు. సభను చూసేది కేవలం వికారాబాద్ ప్రజలు మాత్రమే కాదని, రాష్ట్ర-దేశ ప్రజలు చూస్తున్నారని చురక అంటించారు.బీఆర్ఎస్ హయాంలో దాదాపు రూ. 45 వేల కోట్లు బిల్లులు పెండింగ్‌ పెట్టారన్నారు డిప్యూటీ సీఎం. ఒక్క సివిల్ సప్లై‌లో రూ.18 వేలకోట్ల బకాయిలున్నాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ బిల్లులపై రూ.20 వేల కోట్లను క్లియర్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ధాన్యం గింజను కొన్నామని బీఆర్ఎస్ సభ్యులు చెప్పడాన్ని తప్పుబట్టారు.ప్రస్తుత ప్రభుత్వం రైతులకు మూడు రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నామని వెల్లడించారు. పదేళ్ల ప్రభుత్వంలో మీరు ఇచ్చారంటూ ఎదురుదాడికి దిగారు. ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పులపై సభలో చర్చ పెట్టాలని ఎమ్మెల్యే హరీష్‌రావు సభను డిమాండ్ చేశారు

Related Posts