YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మారని అధికారులు సీఎం ఆదేశించిన ఆగని మొండి వైఖరి

మారని అధికారులు సీఎం ఆదేశించిన ఆగని మొండి వైఖరి

విజయవాడ, డిసెంబర్ 18, 
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్నా అధికారుల తీరులో ఏ మాత్రం కూడా మార్పు కనిపించట్లేదు.. ఇంకా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు వివిధ స్థాయిలో కొనసాగుతూనే ఉన్నారంటున్నారు.. అప్పుడు చేసిన తప్పులు మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తూ వైసీపీ నేతలకు వీరవిధేయుల్లా వ్యవహరిస్తున్నారంట. పేర్ని నాని గోడౌన్‌లో పీడీఎస్‌ బియ్యం మాయమైన కేసులో అధికారులు అవలంభిస్తున్న వైఖరే అందుకు నిదర్శనంగా కనిపిస్తోందంటున్నారుపౌరసరఫరాల సంస్థ ఫిర్యాదు మేరకు ఈ నెల 10న మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన వారిపై కేసు నమోదైంది. ఏకంగా 3,708 బస్తాల బియ్యం మాయమైన ఘటనలో వెంటనే సంబంధిత సంస్థకు చెందిన వారిని అరెస్టు చేయాలి. కానీ అధికారుల మీనమేషాలు లెక్కిస్తూ.. నిందితులు పారిపోయేందుకు అవకాశం ఇచ్చారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ గంగాధర్ చేశారనేదే అసలు ప్రశ్న. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేసిన గంగాధర్‌.. అంగళ్లు ఘటనలో అప్పట్లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేయించి ప్రెస్‌మీట్లు పెట్టి రాజకీయ నాయకుడిలా విమర్శలు గుప్పించారు..అయినా ఆయనను కూటమి ప్రభుత్వం ఉదారంగా కృష్ణా జిల్లా ఎస్పీగా నియమించింది. అప్పట్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిలా గంగాధర్ పని చేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారినా గంగాధర్ వైసీపీ పట్ల తన స్వామి భక్తి వదులుకోవడం లేదంట.. అన్నమయ్య జిల్లాలో చూపిన వేగం ఇప్పుడు ఇక్కడ చూపడంలేదని, ఆయన ఇప్పటికీ వైసీపీ విధేయులుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.భారీ ఎత్తున రేషన్‌ బియ్యం మాయంపై పేర్ని నాని కుటుంబానికి చెందిన వారిపై క్రిమినల్‌ కేసు నమోదైనా.. ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల్లోనూ ఒక్కరంటే ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. ఎవరికి వారే తమ సొంత పనుల్లో బిజీగా ఉన్నట్లున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ తరపున అంతా తానై వ్యవహరించే పేర్ని నాని.. ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. ఇంత భారీ స్థాయిలో ఆయన అక్రమాలు బట్టబయలైనా.. కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడేందుకు కూడా ముందుకు రాకపోవడానికి కారణమేంటన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయిమచిలీపట్నం సమీపంలోని పొట్లపాలెంలో పేర్ని నాని భార్య జయసుధ పేరున ఉన్న గోడౌన్‌లను పౌరసరఫరాలశాఖకు అద్దెకు ఇచ్చారు. లెక్క ప్రకారం ఈ గోడౌన్‌లో 7,719 బస్తాల బియ్యం ఉండాలి. వేబ్రిడ్జి తూకంలో సాంకేతిక సమస్య కారణంగా తూకంలో తేడా వచ్చిందని, 3,200 బస్తాలు తగ్గాయని.. వాటి సొమ్ము చెల్లిస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్‌ గీతాంజలి శర్మకు గతనెల 26న పేర్ని నాని భార్య లేఖ రాశారు. అంతకుముందే గోడౌన్‌లను తనిఖీ చేసి.. బియ్యం నిల్వల వివరాలను ఆన్‌లైన్‌ చేయాలని పౌరసరఫరాల సంస్థ అక్కడి అధికారులను ఆదేశించింది. అయితే పేర్ని నాని గోడౌన్‌ను తనిఖీ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది.కొత్త డీఎం నవంబరు 27న విధుల్లో చేరారు. అంతకు ఒకరోజు ముందు బియ్యం తగ్గాయని పేర్ని నాని కుటుంబం జేసీకి లేఖ రాసింది. అంటే డీఎం తనిఖీ చేస్తే అక్రమాలు బయటకొస్తాయనే ఉద్దేశంతో ముందే జాగ్రత్తపడి లేఖ రాశారని తెలుస్తోంది. వారం తర్వాత జేసీ గోడౌన్‌కు వెళ్లి తనిఖీ చేసి 3,708 బస్తాలు తగ్గాయని తేల్చారు. బియ్యం మాయంపై క్రిమినల్‌ కేసు పెట్టాలని, గోడౌన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడంతోపాటు.. మాయమైన బియ్యానికి రెట్టింపు మొత్తంలో జరిమానా వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ తర్వాత కూడా కృష్ణా జిల్లా అధికారులు అంతా రహస్యం అన్నట్లుగా వ్యవహరించారు. మాజీమంత్రికి సంబంధించిన వ్యవహారంలో చర్యలకు సంకోచించారు.రేషన్‌ బియ్యం మాయంపై గత నెల 26న గోడౌన్‌ నిర్వాహకుల నుంచే సమాచారం వచ్చింది. సాధారణంగా అయితే తక్షణమే సరకు మొత్తం తూకం వేసి.. ఎంత తేడా వచ్చిందో తేల్చాలి. సమగ్ర నివేదిక తయారు చేయాలి. కానీ ఇప్పటి వరకు ఎంతమేర బియ్యం తగ్గాయనే లెక్కలు లేవు. 3,708 బస్తాలు తగ్గాయని మాత్రమే తేల్చారు. బస్తాకు 50 కిలోల లెక్కన.. మొత్తం 1,85,400 కిలోలు తగ్గాయని అంచనా వేశారు. అంటే అధికారుల నిర్లక్ష్యం ఏ పాటిదో అర్థమవుతోంది. పౌరసరఫరాలశాఖ లెక్కల ప్రకారం మాయమైన బియ్యం విలువ సుమారు రూ. 86 లక్షలు. రెట్టింపు జరిమానా వసూలు చేయాలని ఆ శాఖ ఎండీ ఆదేశించారు. అంటే రూ. 1.72 కోట్లు వారి నుంచి రాబట్టాలి. దీనికి సంబంధించి పేర్ని నాని కుటుంబానికి నోటీసు ఇవ్వగా.. వారు జేసీ కార్యాలయంలో రూ.కోటికి చెక్కు ఇచ్చారు.పేర్ని నాని కుటుంబంపై చర్యల విషయంలో అధికార యంత్రాంగం అడుగుడుగునా ప్రేమ ఒలకబోసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బియ్యం పరిమాణం తగ్గిందని ఆయన కుటుంబం నుంచి జేసీకి లేఖ అందింది. మరెవరైనా అయితే నెలనెలా తనిఖీలు చేసి ప్రతి బియ్యం బస్తాను తూకం వేసి లెక్క తేల్చేవారు. కానీ ఇక్కడ మాజీమంత్రి కుటుంబానికి చెందిన గోడౌన్‌ కావడంతో.. వాళ్లే స్వయంగా లేఖ రాసినా అధికారుల్లో కదలికలు లేవు. వారం తర్వాత తనిఖీలు చేశారు. ఆ తర్వాతా ఆ సంస్థపై చర్యలకు వెనకాడారు. తీరిగ్గా ఆ కేసు నమోదు చేశారు. మరెలాంటి అధికారులను ప్రభుత్వ పెద్దలు ఎలా ఉపక్షిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

Related Posts