ముంబాయి
ముంబై దగ్గర అరేబియా సముద్రంలో జరిగిన పడవ ప్రమాదం జరిగింది. ఒక నేవీ స్పీడ్ బోట్ వేగంగి వచ్చి గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా దీవులకు పర్యాటకులతో వెళ్తున్న ఫెర్రీని ఢీకొట్టింది. దీంతో ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది.
ఘటనలొఓ పదమూడు మంది మృతి చెందారు. నేవీ బోట్ లో ఐదుగురు వుండగా ఫెర్రీలో 110మంది ప్రయాణికులు వున్నారు. మృతుల్లో ముగ్గురు నేవి సిబ్బంది వున్నారు. 101 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. నేవీ బోటు మరమత్తుల అనంతరం పరీక్షలు చేస్తుండగా అదుపు తప్పినట్లు నేవీ ప్రకటించింది.
డవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ₹2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ₹50,000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
నౌకా దళం, కోస్ట్ గార్డు సహాయక చర్యలు చేపట్టాయి. పదికొండు నేవి బోట్లు, మెరైన్ పోలీసుల మూడు బోట్లు బాధితులను రక్షించాయి.