తిరుపతి
రాష్ట్ర ప్రభుత్వం పై మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చింది కూటమి ప్రభుత్వం. తిరుపతి పవిత్రతను కాపాడతానని చెప్పిన చంద్రబాబు వాస్తవంలో చేస్తున్నది స్వామి సన్నిధిని అపవిత్రం చేయడమేనని అన్నారు.
మద్యం, మత్తుపదార్థాలు, డ్యాన్సులు, డీజేల వంటి దుష్ట సంస్కృతికి తిరుపతిలో బీజాలు వేస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే ఉదయం 7 నుండి రాత్రి 12 దాకా మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటిని కట్టడి చేయడానికి ప్రభుత్వం, పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలి. తిరుపతి పవిత్రతను, విశిష్టతను కాపాడాలని అయన అన్నారు.