YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అశ్లీల నృత్యాల కేసులో 17మంది అరెస్టు

అశ్లీల నృత్యాల కేసులో 17మంది అరెస్టు

ఏలూరు
ఏలూరు జిల్లా నిడమర్రు మండ లంలో బావయ్య పాలెం ఈనెల 12వ తేదీ రాత్రి రైస్ మిల్లులో జనసేనకి చెందిన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాలు ఘటనలో పోలీ సులు 17 మందిని అరెస్టు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. ఈ నృత్యాలలో ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు హిజ్రాలను తీసుకొచ్చి ఫుల్లుగా మద్యం హిజ్రాలను నగ్నంగా ఉంచి చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పుట్టి నరోజు పేరుతో అశ్లీల నృత్యాలు చేయడంపై గ్రామస్తులు మండిప డుతున్నారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. భీమవరం కు చెం దిన ఇద్దరు హిజ్రాలు ఈ నృత్యా లలో పాల్గొన్నట్లు గుర్తించారు. అంతేకాక జనసేన సైతం దీనిపై చర్యలు చేపట్టింది.

Related Posts