కాకినాడ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ ను అవమానించడమేనంటూ సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి పేర్కొన్నారు. గురువారం కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహo వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.అమిత్ షాను కేబినెట్ నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు.వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదని,అమిత్షా దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో దళిత సంఘ నాయకులు అయితా బత్తుల రామేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు...