YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

65 లక్షలు ఖర్చు చేశారు... ఒక్క రూపాయి ఆన్ లైన్ వ్యాపారం లేదు

65 లక్షలు ఖర్చు చేశారు... ఒక్క రూపాయి ఆన్ లైన్ వ్యాపారం లేదు
అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో నిధులు దుబారా చేస్తున్నారు. లావాదేవీల్లో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ వ్యవస్థ ఆదిలోనే విఫలమైంది. ఇంతవరకు ఒక్క వ్యాపారి కూడా ఆన్‌లైన్‌లో బెల్లం కొనుగోలు చెయ్యకపోయినా ఇందు నిమిత్తం రూ. 65 లక్షలు ఖర్చు చేశారు. ఇటీవల నిర్వహించిన ఆడిట్‌లో ఇదే అంశాన్ని అధికారులు ప్రస్తావించారు. లావాదేవీలు చెయ్యకపోవడంతో ఖర్చంతా వృథా అయిందని నివేదికలో పేర్కొన్నారు.జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి మార్కెట్‌లో పూర్వం నుంచి బహిరంగ వేలం విధానం అమలులో ఉంది. అనకాపల్లి మార్కెట్‌కు ఒక విశిష్టత ఉంది. ఏటా రూ. 140 నుంచి రూ. 150 కోట్ల వ్యాపారం సాగుతున్నా రైతులు మాత్రం యార్డుకు రారు. వ్యాపారులపై నమ్మకంతో బెల్లం పంపుతారు. రైతులు పంపిన బెల్లాన్ని రంగులు, నాణ్యత ఆధారంగా దిగుమతి వ్యాపారులు రకాలుగా పేర్చి అమ్మకం చేస్తారు. దీనిలో దాదాపు 15 నుంచి 20 మంది ఎగుమతి వ్యాపారులు పాల్గొంటారు. భవిష్యత్‌లో నగదు రహిత లావాదేవీలకే ఎక్కువ అవకాశం ఉంది. అందువలన బెల్లం వ్యాపారాన్ని కూడా ఆ దిశగా మార్పు చెయ్యాలన్నదే ప్రభుత్వ ఆలోచన. ఇ-నామ్‌ ద్వారా అయితే నేరుగా రైతు బ్యాంకు ఖాతాకే డబ్బు చేరిపోతుంది. ఇందు నిమిత్తం మార్కెట్‌కు బెల్లం తీసుకువచ్చే రైతుల బ్యాంకు ఖాతా, ఆధార్‌ నెంబరు వంటి వివరాలు మార్కెట్‌ కమిటీ అధికారులు సేకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ధర ఖరారు అయిన తరవాత కొనుగోలు చేసిన వ్యాపారి ఖాతా నుంచి రైతు ఖాతాకు డబ్బు చేరుతుంది. అనకాపల్లి వ్యాపారులతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని వ్యాపారులు పాటలో పాల్గొనవచ్చు. అంటే కొనుగోలుదారులు పెరగడం వలన పోటీ పెరుగుతోంది. దీనివలన సహజంగానే ధరలు పెరుగుతాయి. అంతే కాకుండా ఎగుమతి వ్యాపారులు రైతులకు డబ్బు ఎగవెయ్యడానికి ఎటువంటి అవకాశం ఉండదు.బహిరంగ వేలం విధానం అమలు చేస్తారు. అత్యధిక ధర చెప్పిన వ్యాపారికి పాట ఖరారు చేస్తారు. రైతుకు అత్యధిక ధర వచ్చేవిధంగా దిగుమతి వర్తకులు కృషి చేస్తారు. బెల్లం అమ్మకం చేసిన 24 గంటలలోపు రైతులకు డబ్బు చెల్లిస్తారు.బెల్లం మార్కెట్లో లావాదేవీల్లో ఆన్‌లైన్‌ వ్యవస్థ ఇ-నామ్‌ అమలు నిమ్తితం కేంద్రం ప్రభుత్వం రూ. 15 లక్షలు ఖర్చు చేసి కంప్యూటర్‌లు, ల్యాప్‌ ట్యాప్‌లు అందజేసింది. మార్కెట్‌  కమిటీ మరో రూ. 5 లక్షలు ఖర్చు చేసి క్యాబినులు ఏర్పాటు చేసింది. అమ్మకాల నిమిత్తం ప్రత్యేకంగా ప్లాట్‌ఫాం సిద్ధం చేశారు. ఆరుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వీరికి ప్రతినెలా జీతాలు నిమిత్తం రూ. 1.28 లక్షలు మార్కెట్‌ కమిటీ చెల్లిస్తోంది. రెండున్నరేళ్లగా ఇదే తంతు. ఇంత వరకు జీతాల నిమిత్తం, ఇతర ఖర్చులుగా రూ. 45 లక్షల వరకు ఖర్చు చేసింది. ఇంత చేసినా ఒక్క దిమ్మ కూడా ఈ విధానంలో అమ్మకం చెయ్యలేదు. ఇప్పటికీ ఇక్కడ బహిరంగ వేలం విధానంలోనే అమ్మకాలు కొనసాగుతున్నాయి. అధికారులు మాత్రం బహిరంగ వేలం విధానంలో అమ్మకాలు చేస్తున్న ధరలనే ఇ-నామ్‌లో చేస్తున్నట్లు ప్రతి రోజూ నమోదు చేస్తూ ప్రభుత్వానికి పంపుతున్నారు. దీంతో ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఇక్కడ ఇ-నామ్‌లో వ్యాపారం సాగుతున్నట్లు అధికారులు రికారుల్లో చూపుతున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది యార్డులలో ప్రభుత్వం 2015 సెప్టెంబరులో ఇ-నామ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి మార్కెట్‌ ఒకటి. గత ఏడాది రాష్ట్రంలోని మరో 22 మార్కెట్‌ కమిటీల్లో దీనిని అమలు చేశారు. ఈఏడాది మరో 50 మార్కెట్‌ కమిటీల్లో అమలు చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. అనకాపల్లిలో ఈ విధానాన్ని అమలు చెయ్యడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఒక బ్లాక్‌ను కేటాయించారు. వ్యాపారులు ధరలను నమోదు చేసుకునేందుకు అనుగుణంగా కమిటీ కార్యాలయంలోనే ప్రత్యేకంగా గదిని తయారు చేశారు. ఒకేసారి 17 మంది వ్యాపారులు పాల్గొనే విధంగా క్యాబిన్‌లు  ...మిగతా 15లో ఏర్పాటు చేశారు. వర్తకులు, రైతులు, కార్మికులతో మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు పలు పర్యాయాలు సదస్సులు నిర్వహించారు. అయినా ఇక్కడ మాత్రం పాత విధానంలోనే వ్యాపారం సాగుతోంది. అనకాపల్లి మార్కెట్‌లో ఉన్న పద్ధతుల కారణంగా ఇ-నామ్‌ అమ్మకాలు సాధ్యం కాదని వర్తకులు, కార్మికులు పేర్కొన్నారు.

Related Posts