న్యూ ఢిల్లీ డిసెంబర్ 19
పార్లమెంటు ఆవరణలో గందరగోళం నెలకొంది. డా బిఆర్ అంబేడ్కర్‌ను కేంద్ర హోంశాఖ అమిత్ షా అవమానించరంటూ విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీగా నిరసన తెలియజేశారు. ఇరుపక్షాల నిరసనలతో పార్లమెంటు ప్రాంగణం హోరెత్తింది. అంబేడ్కర్‌ను అవమానించరంటూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పార్లమెంటు లోపలికి వెళ్తున్న ఎంపిలను విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బిజెపి ఎంపి ప్రతాప్ సింగ్ సారంగి గాయపడ్డారు. స్వల్పంగా గాయపడిన ఎంపిని ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధే నెట్టారని అధికార పక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.