హైదరాబాద్:
కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్. తాజాగా ఈ సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమం తెలుగు ఫిలిం ఛాంబర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొని చిత్రయూనిట్‌ను అభినందించారు.తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. ''తెలంగాణ ఉద్యమంలోని కష్టాలను ఈ సినిమాలో చూపించారు. ఉద్యమంలో పని చేసిన కళా శ్రీనివాస్ ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి ఈ సినిమా తీశాడు. ఉద్యమాన్ని చూపిస్తున్న ఇలాంటి సినిమాను ప్రతి ఒక్కరు ఆదరించాలి. చిత్రయూనిట్‌ను అభినందిస్తున్నాను.'' అని అన్నారు.తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''ఇలాంటి సినిమాలను మనమంతా ఆహ్వానించాలి. ఈ సినిమాలో నటీనటులు బాగా చేశారు. ఒక సినిమాతో ఎన్నో కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. అందుకే ఈ సినిమాను హిట్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమా విడుదల విషయంలో నా మద్దతు ఉంటుంది.'' అని అన్నారు.
డైరెక్టర్ కళా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్పది, ఇక్కడి ప్రకృతి ఎంతో బాగుంటుంది. తెలంగాణలో ప్రతి అంశంపై సినిమా తీయొచ్చు. తెలంగాణ సినిమాలు ఇంకా ఎన్నో రావాల్సి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని తెరపై ఆవిష్కరించాము. నిజ జీవితంలో మంచి క్యారెక్టర్ ఉన్న వారినే సినిమాలో క్యారెక్టర్లుగా తీసుకున్నాను. పోరాటాలకు విరామం ఉండదనే కాన్సెఫ్టుతో ఈ సినిమా చేశాను. సాయి చందు, జై శ్రీను వంటి తెలంగాణ ఆణిముత్యాలను కోల్పోయాం. ఉద్యమ కళాకారులను, నా ఆత్మీయులను ఈ సందర్భంగా తలుచుకోవడం భావోద్వేగంగా ఉంది. 'డెక్కన్ సర్కార్' ప్రీరిలీజ్ ఈవెంట్ త్వరలో నిజామాబాద్‌లో భారీగా నిర్వహించబోతున్నాము. ఈ సినిమాను ఆదరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మా సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమంకు వచ్చిన అతిథులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మీడియా మిత్రులకు పేరుపేరున కృతజ్ఞతలు.'' అని అన్నారు.
ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం కళా శ్రీనివాస్ ఎంతో శ్రమించారు. సినిమాను తెరకెక్కించిన తీరు బాగుంది. సినిమాకు మన అందరి సహకారం అవసరం. చిన్న సినిమాను పెద్ద హిట్ చేయాలి.'' అని అన్నారు.
నటి హేమ మాట్లాడుతూ.. డైరెక్టర్ కళా శ్రీనివాస్ ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొని ఒక మంచి సినిమాను మన ముందు ఉంచారు. ఈ సినిమాను మనమంతా ఆదరించాలి.
డైరెక్టర్ కళా శ్రీనివాస్ తన ప్రతిభతో 12 సంవత్సరాల ఉద్యమాన్ని 2 గంటల్లో చూపించారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కొనియడారు. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించబోతున్న సినిమా అంటూ కీర్తించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు ముఖ్యపాత్రలోనూ డైరెక్టర్ కళ శ్రీనివాస్ పాత్ర ప్రశంసించదగినదని అన్నారు.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
కళా శ్రీనివాస్.