YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంగట్లోకి అంగన్వాడీ గుడ్లు

అంగట్లోకి అంగన్వాడీ గుడ్లు

రాజమండ్రి, డిసెంబర్ 20, 
కోడిగుడ్డు ధరలు బాగా పెరిగాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. వినియోగదారులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఈ ధరల ప్రభావం కేవలం వినియోగదారులపైనే కాకుండా.. ప్రభుత్వంపైనా పడుతోంది. అయినా ప్రభుత్వం వెనకడుగు వేయకుండా.. చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆధీనంలోని విద్యా సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఏలోటూ లేకుండా గుడ్ల సరఫరా చేస్తోంది. అయితే.. ధరలు పెరగడంతో.. కక్కుర్తి రాయుళ్లు జూలు విదిల్చారుప్రభుత్వం కాంట్రాక్టర్లకు గుడ్లు సరఫరా చేసినందుకు.. ఆ నెలలోని మార్కెట్‌ ధరకు అదనంగా 51 పైసలు రవాణా ఛార్జీలు కలిపి చెల్లిస్తుంది. ఇటీవల కోడిగుడ్ల ధర రూ.7 వరకు అయ్యింది. దీంతో గిట్టుబాటు కాక చిన్నసైజు గుడ్లను స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం.. ఒక గుడ్డు 45 గ్రాముల బరువు ఉండాలి. కానీ.. సరఫరా చేస్తున్న గుడ్డు అంత ఉండటం లేదు. రాష్ట్రంలోని 55 వేల 607 అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతీరోజూ లక్షలాది గుడ్లను సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం అన్నీ చిన్న సైజు గుడ్లనే సరఫరా చేసేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.లేయర్స్‌ మొదటి దశలో సైజు తక్కువ గుడ్డు పెడుతుంది. వాటిని మార్కెట్‌లో విక్రయించే వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేయరు. దీంతో కాంట్రాక్టర్లు ఆ గుడ్లనే ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్‌వాడీలకు పంపిస్తారు. వాటికి ధర కూడా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగామే ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నసైజు గుడ్లు దర్శనమిస్తున్నాయి.కాంట్రాక్టర్లు అలా చేస్తే.. సిబ్బంది మరో అడుగు ముందుకేసి డబ్బులు సంపాదిస్తున్నారు. చాలా అంగన్‌వాటీ కేంద్రాల్లో 50 శాతం కూడా హాజరు ఉండటం లేదు. కానీ.. అందరూ వచ్చినట్లు, గుడ్లు తీసుకున్నట్టు, తిన్నట్టు నమోదు చేసి.. మిగిలిన గుడ్లను మార్కెట్‌లో ఒకటి 6 రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు. తక్కువకు రావడంతో చిన్న చిన్న వ్యాపారులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కటి రెండూ సెంటర్లలో ఇలా చేస్తున్నారంటే ఏమో అనుకోవచ్చు. కానీ.. వేలాది అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది.ఈ దందా చూడటానికి చిన్నగానే కనిపిస్తున్నా.. లెక్కలు వేస్తే అసలు విషయం తెలుస్తుంది. ఉదాహరణకు.. రాష్ట్రంలో 55 వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి సగటున రోజుకు 50 గుడ్లు వచ్చాయి అనుకున్నా.. 27 లక్షల 50 వేల అవుతాయి. వాటిల్లో 60 శాతానికి పైగానే లబ్ధిదారులకు ఇచ్చినా.. ఇంకా 10 లక్షల గుడ్లు మిగులుతాయి. అలా ఒక్కో గుడ్డును 6 రూపాయలకు విక్రయిస్తే.. రూ.60 లక్షలు అవుతుంది.

Related Posts