YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేన గూటికి ఆమంచి...

జనసేన గూటికి ఆమంచి...

ఒంగోలు, డిసెంబర్ 20, 
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమెహన్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకానొక టైంలో జిల్లా రాజకీయాలను ఏలిన నేత. కానీ ఇప్పుడు ఆయన రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. చీరాల సెగ్మెంట్లోని వేటపాలెం జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆమంచి.. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా చీరాల నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014లో నవోదయం పార్టీ అభ్యర్ధిగా ఆటో గుర్తుపై రెండో సారి పోటీ చేసి చీరాలలో తిరిగి విజయం సాధించారు. తర్వాత టీడీపీలో చేరిన ఆయన.. మంత్రి పదవి ఆశించి.. అది దక్కకపోవడంతో గత ఎన్నికల ముందు వైసీపీ నీడకు చేరారు.2019 ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్ధి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కరణం బలరాం వైసీపీలో చేరడంతో.. చీరాలలో కరణం, ఆమంచిల మధ్య ఆధిపత్యపోరు తీవ్ర స్థాయికి చేరింది. వారి విభేదాలకు చెక్ పెట్టడానికి వైసీపీ అధ్యక్షుడు ఆమంచిని పర్చూరు వైసీపీ ఇంచార్జ్ గా పంపారు. అక్కడ గెలవడం కష్టమన్న భావనతో ఆమంచి తిరిగి చీరాలకు వచ్చి అక్కడ నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ కూడా చేశారు.అయితే చీరాల వైసీపీ టికెట్ తనకే దక్కుతుందని ధీమాతో కనిపించిన ఆమంచికి జగన్ షాక్ ఇచ్చారు. చీరాల వైసీపీ టికెట్ ఎమ్మెల్యే బలరాం కుమారుడు కరణం వెంకటేష్‌కు కేటాయించి.. ఆమంచికి పర్చూరు టికెట్ ఆఫర్ చేశారు. అందుకు ఆమంచి తిరస్కరించి.. తన రాజకీయ జీవితం ఇచ్చిన చీరాలకే ఫిక్స్ అవుతానని వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.?ఇక గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఆమంచి కృష్ణమోహన్. తన ప్రత్యర్ధిని ఒడిస్తానని చెప్పి మరి చేసి చూపించారు ఆమంచి. చీరాల నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన.. నలభై వేల ఓట్లు సాధించారు. వైసీపీ తరపున పోటీ చేసిన కరణం వెంకటేశ్ ఓట్లు చీల్చడంలోనూ.. ఆయన ఓటమి లోనూ.. అమంచి చాలా కీలకపాత్రే పోషించారు. మొత్తానికి తాను అనుకున్న గోల్ అయితే రీచ్ అయిన ఆమంచి.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నా అంత సంతృప్తిగా ఫీల్ కావడం లేదట. ఈ వ్యవహారమే ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది.ఆమంచి కృష్ణ మోహన్ జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే జనసేన పార్టీ వర్గాలతో సైతం ఆయన సంప్రదింపులు జరిపినట్లు టాక్ నడుస్తుంది. గతంతో కూడా తాను పవన్ కల్యాణ్ పై చేసిన విమర్శలు.. వైసీపీ అధిష్టానం సూచిస్తేనే మాట్లాడినట్టు పలు వేదికల్లో ఓపెన్ గానే వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కి ముందు కూడా ఆయన జనసేనలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. దాంతో మళ్లీ ఆమంచి జనసేన లో జాయినింగ్ అంటూ వాదనలు వినిపిస్తున్నాయి.మరోవైపు ఆమంచి కృష్ణమెహన్ సొదరుడు ఆమంచి స్వాములు ఇప్పటికే జనసేన పార్టీలో యాక్టీవ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో గిద్దలూరు, చీరాల నుంచి టికెట్ ఆశించి.. కూటమి సమీకరణాల్లో పోటీ చేయకుండా ఉన్నారు స్వాములు. అయితే గత కొన్నేళ్లుగా అన్న తమ్ముళ్ల మధ్య వైరం ఏర్పడింది. వారిద్దరూ మధ్య మాటలు కట్ అయ్యాయని కూయ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారడంతో.. ఇద్దరు రాజీకి వచ్చి ఓకే పార్టీలో కొనసాగుతారా అని చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇద్దరు ఓకే పార్టీలో ఉంటే జనసేనకు డబుల్ బొనాంజాగా మారతారని అనుకుంటున్నారు. అలానే ఆమంచి బ్రదర్స్ మళ్లీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పే ఛాన్స్ కూడా ఉందని డిస్కస్ చేసుకుంటున్నారు.అయితే ఆమంచి కృష్ణమెహన్ కు.. మాజీ మంత్రి బాలినేనికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం ఉందని చెబుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్ది కాలం క్రితమే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఈ పరిస్థితుల్లో కృష్ణమెహన్ జనసేనలోకి రావడాన్ని బాలినేని అడ్డకుంటారని కూడా టాక్ నడుస్తోంది. సంక్రాతి తర్వాత జనసేనలో చేరేందుకు ఆమంచి భావిస్తున్నారట. ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కూడా ప్రస్తుతానికి ఎటువంటి సిగ్నల్స్ రాలేదని.. ఆ చర్చల్లో ఆమంచి కృష్ణ మోహన్ ఉన్నారని ప్రచారం జరగుతోంది.రాజకీయ భవిష్యత్తు కోసం ఆమంచి కృష్ణ మోహన్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ? జనసేనాని ఆయన రాకకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ? ఆమంచి చేరికను బాలినేని అడ్డుపడతారా ? చేరిన తర్వాత అమంచి సోదరులు మళ్లీ కలిసిపోయి ఉమ్మడి జిల్లాలో మళ్లీ చక్రం తిప్పగలరా అని చర్చించుకుంటున్నారు.

Related Posts