YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు రామ్ మాధవా.. కిషనా...

బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు రామ్ మాధవా.. కిషనా...

హైదరాబాద్, డిసెంబర్ 20, 
తెలుగు నేతలకు మరో అరుదైన చాన్స్. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఇద్దరి పేర్లను పరిగణలోకి తీసుకుంది బిజెపి హై కమాండ్. అయితే ఏపీకి చెందిన నేతకు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.బిజెపి జాతీయ అధ్యక్షుడు మారనున్నారు. ప్రస్తుతం జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఆయన మార్పు అనివార్యంగా తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. మరోసారి జెపి నడ్డాకు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఈ తరుణంలో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రముఖంగా శివరాజ్ సింగ్ చౌహన్ పేరు వినిపించింది. అయితే ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. బిజెపి దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో కీలకమైన స్థానాలను దక్షిణాది రాష్ట్రాల నుంచి గెలుపొందాలని ప్లాన్ చేస్తోంది. ఈ తరుణంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతలకు జాతీయ పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనుంది. అయితే ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న నేతలు కావడం గమనార్హం.తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ఢిల్లీ అగ్రనేతలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కిషన్ రెడ్డి. బిజెపి భావజాలం ఉన్న నేత కూడా. ప్రధాని నరేంద్ర మోడీ సమకాలీకుడు. అయితే నరేంద్ర మోడీ మాత్రం గుజరాత్ కు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఏకంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని మార్చుతారని ప్రచారం నడుస్తోంది. ఆయన పేరును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.అయితే ఏపీకి చెందిన రామ్ మాధవ్ కు ఛాన్స్ అని తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ లో జాతీయస్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టిన రామ్ మాధవ్ 2014లో బిజెపిలో చేరారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. ఈయన తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందినవారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మైసూర్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు. 1981లో ఆర్ఎస్ఎస్ లో చేరారు రామ్ మాధవ్. సమర్థవంతంగా తన సేవలు అందించగలిగారు. గత కొద్దిరోజులుగా బిజెపిలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఏపీలో టీడీపీతో బిజెపి పొత్తు కుదర్చడంలో రామ్ మాధవ్ పాత్ర కీలకమని వార్తలు వచ్చాయి. 2014లో బిజెపి జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు రామ్ మాధవ్. ఆయనకు బిజెపి జాతీయ పగ్గాలు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ సిఫారసు చేసినట్లు సమాచారం. అటు బిజెపి అగ్ర నేతలు సైతం దీనికి సమ్మతించినట్లు ప్రచారం నడుస్తోంది. వచ్చే ఏడాదిలో జాతీయ అధ్యక్షుడు నియామకం ఉన్న నేపథ్యంలో.. రామ్ మాధవ్ పేరు ఖరారు చేస్తారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts