*వివిథ శరీరథారులమైన మనం విశ్వశక్తిలో భాగమైయున్న శక్తులం తప్ప వ్యక్తులం కాదు. కాని వ్యక్తులుగా కనిపిస్తుంటాము.
*అటువంటి మనం శరీరథారులు కావటానికి కారణం,అలా కావాలనే ఒక సంకల్పం. అటువంటి సంకల్పంతో వచ్చిన మనం అనేక శరీరాలను థరిస్తుంటాము. కాబట్టి ఆ థరించే క్రమంలో అనేక జీవరాసులుగా జన్మలు ఎత్తుతుంటాము.
*అయితే ఇదంతా ఎందుకని ప్రశ్నించుకుంటే, ఖాళీగా ఉన్నవాడికి బోర్ కొట్టి ఒక ఆట ఆడుకున్నట్లు,ఐడిల్ గా ఉండే విశ్వశక్తి వివిథ అనుభూతుల కొరకు అనేక రూపాలు ధరించిందని అవగాహన చేసుకోవచ్చు.
*అలా ఒక ఆట ఆడటానికి రెండు వర్గాలు అవసరమైనట్లు, జీవితమనే ఆట కొరకు ఈ విశ్వశక్తి అనేక జీవరాశులుగా ఏర్పడింది. ఎందుకంటే నవరసాలతో వివిథ అనుభూతుల కొరకు వివిథ రకాలుగా వేరుపడాలి.
*కాబట్టి ఈ వేరుపాటంతా ఒకే శక్తిది అని తెలుసుకొని బ్రతికితే జీవితం యొక్క పరమార్థం తెలుస్తుంది. అలానే అది కాదని వేరుపడిన నేను వేరని భావిస్తే అజ్ఞానంలో బ్రతక వలసి వస్తుంది.
*కనుక జ్ఞానం, అజ్ఞానాల మధ్య ఉన్నభేదం నేను,నువ్వు వేరువేరని భావించటం తప్ప ఇంకొకటి కాదు. కనుక కామ, క్రోథ, లోభ, మొహ,మద,మత్సరాలతో వేరుపడియున్న మనమంతా ఒకటేనని గ్రహించి వాటిని మన అదుపులో ఉంచుకుంటే అది మోక్షం అవుతుంది. లేకుంటే అవి కల్పించిన భవబంధాలకు బానిసలై బ్రతుకును భారం చేసుకోవటం జరుగుతుంది.
*కనుక అలా భారం కాకుండా బ్రతకటానికి మనం రెండు పనులు చేయవలసి ఉంటుంది. అందులో ఒకటి మనసును నిలకడచేసి ప్రాణశక్తిని బలపరచటం. అలానే రెండోది మనసును అజ్ఞానంలో ఉంచకుండా జ్ఞానవైపు మరల్చటం.
*ఎందుకంటే ప్రాణశక్తిని బలపరచకుంటే కామ,క్రోథ,లోభ,మోహ,మదమత్షరాలనే అరిషడ్ వర్గాలను అదుపుచేయలేము. అలానే జ్ఞానాన్ని అభివృధ్ది చెందనీయకుంటే బలపడిన ప్రాణశక్తితో యొగభ్రష్టులు కావటానికి అవకాసం ఉంటుంది.
*కనుక మనసు మరియు ప్రాణంగా చీలియున్న మన ఆత్మశక్తి అదుపాజ్ఞలలో ఉంటేనే జీవితం నందనవనం అవుతుంది. లేకుంటే నరకం ఇంకెక్కడో కాకుండా మన వెంటే ఉంటుంది.
*కనుక మొక్షం పేరుతో బైరాగులు కాకుండా అరిషడ్ వర్గాలను జయించి శృష్టికి ఒక అర్థాన్ని చేకూర్చి జీవితాల నుంచి పారిపోకుండా మేలుకుందాం.
*అయితే ఈ మేలుకునే లోపు ఒక ఆటకు ఉండే కొన్ని నియమాలు మాదిరిగా ధర్మమనే నియమావళితో బ్రతుకుతూ జీవితమనే ఆటను సక్రమంగా ఆడుతూ జీవిత పరమార్ధాన్ని కూడా తెలుసుకుందాం.