YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అసెంబ్లీలో ఒక్క మంత్రి కూడా ఎందుకు లేరు హరీష్రావు

అసెంబ్లీలో ఒక్క మంత్రి కూడా ఎందుకు లేరు హరీష్రావు

హైదరాబాద్
శుక్రవారం నాడు సభలో ఒక్క మంత్రి కూడా ఎందుకు లేరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు  ప్రశ్నించారు. అసెంబ్లీ అంటే మంత్రులకు ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్పై చర్చకు స్పష్టమైన హామీ ఇస్తేనే తాము సభ సాఫీగా జరగడానికి సహకరిస్తామని అన్నారు. ఒక సభ్యునిపై కేసు పెట్టారని.. సభ నడుస్తున్నప్పుడు ఆ సభ్యునికి వాస్తవం చెప్పుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. కేటీఆర్పై పెట్టింది ముమ్మాటికీ అక్రమ కేసే అని హరీష్రావు అన్నారు.

సభా సమయాన్ని వృథా చేయడం సరికాదు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్
సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. సభలో ఒక్క మంత్రి కుడా లేరని హరీష్రావు వ్యాఖ్యలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడారు. కొందరు మంత్రులు శాసనమండలిలో ఉన్నారని చెప్పారు. భూభారతి బిల్లుపై చర్చ పూర్తి కానివ్వాలని అన్నారు. బిల్లుపై చర్చ పూర్తయిన తర్వాత సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒక సభ్యుని కోసం సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.

Related Posts