రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వ్యవహారాలు, కేంద్రం ఇస్తోన్న నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా? అని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు. విజయవాడ అలంకార్ సెంటర్లో సోమవారం నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో ఏపీ ప్రజలకు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రధాని మోదీపై టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ.. విజయవాడ ధర్నాచౌక్‌లో జరిగిన మహాధర్నా నిర్వహించారు 'ఏపీ ప్రజల్ని మోసం చేస్తూ చంద్రబాబు పాలన చేస్తున్నారు. ఆయనలో నియంతృత్వ ధోరణి బాగా పెరిగిపోయింది. బీజేపీపై అసత్యాలను ప్రచారం చేస్తూ.. దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. వైసీపీ, జనసేనతో సంబంధాలను అంటగట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. ఆయన మోసాలను, మాయ మాటల్నిప్రజలకు వివరిస్తామన్నారు.మొదట్లో కాంగ్రెస్ పార్టీని, ఆ తర్వాత ఎన్టీఆర్‌ని, ఇప్పుడు నరేంద్రమోడీని చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రన్న బీమాకు కేంద్రం నిధులిస్తుంటే ముఖ్యమంత్రి తన పేరు పెట్టుకున్నారని, గృహ నిర్మాణ పథకాలకు మోడీ సర్కారు డబ్బులిస్తుంటే ప్రచారం మాత్రం చంద్రబాబు చేసుకుంటున్నారని కన్నా విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల నుంచి కేంద్రం నిధులిస్తుంటే వాటిని దారి మళ్లించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆరోపించారు. చంద్రబాబుకు ధైర్యముంటే ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోంటే ఆ ప్రాజెక్టు నిర్మాణ ఘనత తమదిగా టీడీపీప్రభుత్వం చెప్పుకోవటం సిగ్గుచేటని మహిళా నేత దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారురాజకీయ లబ్దికోసమే బీజేపీపై విమర్శలు. బీజేపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వారిపై బౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదు. ఈ మహాధర్నా అధికార పార్టీకి ఓ హెచ్చరికవంటిదన్నారు.2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తాం. టీడీపీ ప్రభుత్వంలో చాలా శాఖల్లో అవినీతి జరుగుతోంది. ఉచిత ఇసుక పేరుతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. ఏపీకి కేంద్రం ఎంతో సాయం చేసింది. అయినా చంద్రబాబు తానే నిధులు తీసుకొచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి మాణిక్యాలరావు. ఈ ధర్నా కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే మాధవ్, పురందేశ్వరి, విష్ణువర్థన్‌రెడ్డితో పాటూ ముఖ్య నేతలు పాల్గొన్నారు