బీజింగ్, డిసెంబర్ 23,
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరిగాయి. అదే రోజు అర్ధరాత్రికి ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఘన విజయం సాధించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కమలా హారిస్ ఆశలు ఆవిరయ్యారు. ట్రంప్ విజయంతో చాలా మంది అంచనాలు తారుమారయ్యాయి. ఇదిలా ఉంటే.. ట్రంప్ 47వ అధ్యక్షుడిగా 2025, జనవరి 20న వైట్‌హౌస్‌లో అడుగు పెట్టనున్నారు. ఈమేరకు అధికార మార్పిడికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ కూడా కొత్త మంత్రులు, ఇతర అధికారులను ఎంపిక చేస్తున్నారు. ఇక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి రావాలని ట్రంప్ ఆహ్వానాలు పంపుతన్నారు. ఈ క్రమంలో శత్రు దేశమైన చైనాకు కూడా ఆహ్వానం పంపించారు. ఈమేరకు జిన్ పింగ్‌ను ట్రంప్ ఆహ్వానించారు. అయితే దీనిని అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ధ్రువీకరించలేదు.అమెరికా, చైనా మధ్య సత్సంబంధాలు లేవు. ఆధిపత్యం కోసం ఇరు దేశాలు పోటీ పడుతున్నాయి. తాను అధికారంలోకి వచ్చాక చైనా దిగుమతులపై సుంకాలు ఎంచుతామని ప్రకటించారు. ఇక ప్రమాణం చేసిన తొలి రోజే 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇందులో అక్రమ వలసదారుల తరలింపు కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితిలో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ట్రంప్ వివిధ దేశాలకు ఆహ్వానం పంపుతున్నాడు. ఈ క్రమంలో శత్రు దేశమైన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు కూడా ఆహ్వానం పంపించారు. అయితే ఆయన హాజరవుతారా లేదా అన్న విషయమై చైనా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.ట్రంప్ మాట్లాడుతూ, ‘చైనాతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మేము అధ్యక్షుడు జితో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాము మరియు చర్చిస్తున్నాము అని పేర్కొన్నారు.