తాడేపల్లి
మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పులివెందులలో పర్యటిస్తారు.
మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైయస్ రాజశేఖర్రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు, అనంతరం ప్రేయర్ హాల్లో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు, సమావేశం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్ళి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు
బుధవారం నాడు ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు, ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతం పులివెందుల చేరుకుని రాత్రికి బస చేస్తారు
గురువారం ను లివెందుల క్యాంప్ ఆఫీస్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు.
శుక్రవారం నాడు ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్లో జరగనున్న వివాహానికి హాజరవుతారు, అనంతరం బయలుదేరి బెంగళూరు వెళతారు