జస్టిస్ ఈజ్ ఇన్ యాక్షన్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన `సూపర్ స్కెచ్` మైండ్ గేమ్ అనే పాయింట్ ను హైలైట్ చేస్తూ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. నందమూరి బాలకృష్ణ తో `శ్రీమన్నారాయణ`, జగపతి బాబుతో `సామాన్యుడు`, సుమంత్ తో `దగ్గరగా దూరంగా`, నితిన్ తో `విక్టరీ`, ఆదితో `ప్యార్ మే పడిపోయా`, `ది ఎండ్` వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన రవి చావలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్ టోనీ (ఇంగ్లాండ్) తదితరులు ఇందులో కీలక పాత్రధారులు. యు అండ్ ఐ- ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో శ్రీ శుక్ర క్రియేషన్స్ ప్రొడక్షన్స్ పై బలరామ్ మక్కల నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ``మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమిది. `సూపర్ స్కెచ్` అనే టైటిల్ కథకు చక్కగా సరిపోతుంది. అన్నీ పనులూ పూర్తయ్యాయి. తొలి కాపీ సిద్ధమైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లరిది. ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది. రవి చావలి దర్శకత్వంలో మరో హిట్ చిత్రం ఖాయం.ఈ నెల 29 న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం `` అని అన్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం, జునైద్ ఎడిటింగ్, కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. సుభాష్, నారాయణ్, ఇంజపూరి, ప్రియాంక సాహిత్యం సమకూర్చారు.