మహబూబాబాద్
కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీనగర్ గిరిజన బాలికల గురుకులంలో మంత్రి సీతక్క విద్యార్థులతో కలిసి రాత్రి బస చేసారు. గురువారం ఉదయం పిల్లలతో కలిసి యోగా సాధన చేసారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందుతుందా లేదా అని ఆరాతీసారు. రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన ప్రణవి అనే విద్యార్థినిని అభినందించి పారితోషికం అందించారు.