YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రెడీ అవుతున్న హైడ్రా యాప్

రెడీ అవుతున్న హైడ్రా యాప్

హైదరాబాద్, డిసెంబర 26, 
చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై గత కొన్ని నెలలుగా హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు ఏర్పాటైన హైడ్రా.. భవిష్యత్తు తరాలకు ఓ మంచి నగరాన్ని అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. సరైన ప్రణాళికతో నిర్మాన అనుమతితో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు 27 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టి సంచలనం సృష్టించిన రంగనాథ్.. పలు జిల్లాల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలనే అభ్యర్థనపై ఆయన స్పష్టమైన వివరణిచ్చారు.హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుతాయని, ఆ నిర్మాణాలను కూల్చబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎఫ్‌టీఎల్‌లో ప్రజలు నివాసం ఉంటున్న భవనాలు కూల్చమని తెలిపారు. ప్రజలు నివాసం ఉంటున్న ఎలాంటి భవనాలు కూల్చబోమన్న ఆయన అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా చర్యలు ఉంటాయని అన్నారు. గుండ్లపోచంపల్లి చెరువులోకి ఓ ప్రైవేటు సంస్థ కలుషిత జలాలను విడుదల చేస్తుందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్.. నెల రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతుందని చెప్పారు. ఇప్పటికైతే కాలుష్య నియంత్రణ మండలికి కంప్లైంట్ చేయండని సూచించారు.ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లపై క్లారిటీ రాగానే హైడ్రా మొబైల్ యాప్ అందుబాటులోకి తెస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మీరెక్కడున్నా సరే మీ ప్రాంతం చెరువులో ఉందా, లేదా అన్న విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చారు. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా బఫర్‌జోన్‌లు తెలుసుకునే అవకాశం ఇస్తామని చెప్పారు.సఫిల్ గూడ, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లోని చెరువుల ఆక్రమణలపై వచ్చిన ప్రశ్నకు కమిషనర్.. బఫర్ జోన్ లో అయినా, ఎఫ్టీఎల్ లో అయినా జూలై 2024 కు ముందు కట్టిన ఇళ్లను కూల్చేస్తామన్నారు. కొత్తగా ఆక్రమణలు జరగకుండా హైడ్రా కాపాడుతుందన్నారు. చెరువులు, నాలాలను ఆక్రమిస్తే అది ఎవరైనా సరై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చెరువులు ధ్వంసం కాకుండా చూసుకోవడమనే తమ లక్ష్యమని, కర్తవ్యమని చెప్పారు. అలా అని కూల్చవేతలనూ ఆపమని స్పష్టం చేశారు. కూలగొట్టడం ఒక్కటే హైడ్రా పని కాదని 12 చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నట్లు వివరించారు.పలు జిల్లాల్లో హైడ్రాను ఏర్పాటు చేయాలనే దానిపై కొందరు ప్రశ్నించగా.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీస్తున్నారని కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం రాజధానిలోని ఓఆర్ఆర్ పరిధిలోనే హైడ్రా పని చేస్తుందని స్పష్టం చేశారు.ఆక్రమణలపై హైడ్రాకు ఇప్పటికే 6 వేలకు పైగా ఫిర్యాదులందాయని రంగనాథ్ చెప్పారు. 2025 నుంచి ప్రతి సోమవారం ట్యాంక్‌బండ్‌ బుద్ధభవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 1.30గంట నుంచి 3.30గంటల మధ్య తాను ఫిర్యాదులను స్వీకరిస్తున్నామన్నారు. తాను అందుబాటులో లేకపోతే 7207923085 నెంబర్‌కు వివరాలు పంపొచ్చునని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేసారు.

Related Posts