హైదరాబాద్
అందరు సీఎంలు సినిమా పరిశ్రమలను బాగానే చూసుకుంటున్నారని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. దిల్ రాజును ఎఫ్డిసీ చైర్మన్గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతున్నామని అన్నారు.
హీరో నాగార్ఝున మాట్లాడుతూ యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలి. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే, సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరికని అన్నారు.
నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్డే ఉంటుంది. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజ్లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల, ప్రమోషన్ను విస్తృతంగా చేస్తున్నామని అన్నారు.
నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను. హైదరాబాద్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని అన్నారు.
మరో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉంది. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చింది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్గా ఉండాలని అన్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతే మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కి వచ్చిందని అన్నారు,.