విశాఖపట్నం
కల్లోల్లాన్ని రేపిన సునామికీ 2 దశాబ్దాలు పూర్తైంది.ఆనాటి చేదు జ్నాపకాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్ లో ఎలాంటి విపత్తులు సంభవించకుండా ఉండేలా ఏటా మత్య్సకార మహిళలు గంగమ్మతల్లికి పూజలు చెయడం ఆనవాయితీగా వస్తోంది.మత్య్ససంపదపై ఆధారపడి జీవించే మత్య్సకారులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండాలని కోరుతూ విశాఖ పెద్ద జాలరిపేట సముద్ర తీరంలో మత్య్సకార మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.సునామీ వచ్చి 20ఏళ్లు గడిచిన సందర్భంగా మత్స్యకార కుటుంబాలు పెద్ద సంఖ్యలో కలశలు పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామాస్థులంతా సముద్ర తీరానికి పసుపు, కుంకుమ పాలతో చేరుకుని గంగమ్మకు పూజలు చేసి వాటిని సమర్పించారు.అప్పట్లో వచ్చిన సునామీ ముప్పుతో మత్య్సకారుల జీవితాలు చిన్నాభన్నమయాయి.అయితే ఎక్కడా ప్రాణనష్టం కూడా జరగలేదు. దీనికి గంగమ్మ తల్లి దీవెనలే కారణమని విశాఖపట్నం మత్స్యకారులు నమ్ముతున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబరు 26వ తేదీన పెదజాలారిపేటలో గంగమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 26న రోజు పెద్దఎత్తున మత్స్యకారులు తీరం వద్దకు చేరుకుని పూజలు చేసి తమ కుటుంబాలకు గంగమ్మతల్లి దీవెనలు అందించాలని కోరుతున్నారు.