YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ ఒంటెద్దు పోకడలా...

రేవంత్ ఒంటెద్దు పోకడలా...

హైదరాబాద్, డిసెంబర్ 27, 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను నిర్ణయాలను ఒక్కరే తీసుకోవడం లేదు.ముఖ్యమైన నిర్ణయాలన్నీ మంత్రి వర్గ సహచరులతో చర్చించిన తర్వాతనే నిర్ణయాన్ని వెలువరిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాలు పార్టీకి బలోపేతానికి ఉపయోగపడతాయా? లేదా? అన్నది పక్కన పెడితే ఏకపక్షంగా మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రధానంగా ముఖ్యమైన అంశాల విషయంలో రేవంత్ అందరి అభిప్రాయాలను తీసుకునే ముందుకు వెళుతున్నారని నేతలే చెబుతున్నారు. అందుకే నేతల నుంచి ఆయన నిర్ణయాలకు మద్దతు ఎక్కువగా కనిపిస్తుంది. పీసీసీ చీఫ్ నుంచి కీలకమైన మంత్రుల వరకూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారంటే అందరినీ కలుపుకుని వెళ్లడమే ఇందుకు ప్రధాన కారణం.. ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈ ఫార్ములా కారు రేస్ విషయంలో కేసు నమోదు చేయడం కూడా మంత్రి వర్గ సమావేశంలోనే చర్చించి వారిని ఒప్పించగలిగారు. అయితే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని ఒకరిద్దరు మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ అంత సీన్ లేదని, బీఆర్ఎస్ నేతల అవినీతి బండారాన్ని బయటపట్టేందుకు ఇటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి నచ్చ చెప్పారని తెలిసింది. కేటీఆర్ గత పదేళ్లుగా తెలంగాణ ప్రజల సొమ్మును ఎలా దోచుకుతిన్నదీ ప్రజలకు తెలయజేయవచ్చన్న కారణంతోనే కేటీఆర్ పై కేసు నమోదు చేశారన్నది కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తున్నఒపీనియన్. సానుభూతి రాదని, కల్వకుంట్ల కుటుంబంపై జనంలో వ్యతిరేకత పెరుగుతుందని కూడా కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు.  సరే.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం అంటే ఎన్నికలకు ముందు నుంచి ఆరోపణలు చేస్తుందే కాబట్టి, దానిపై జస్టిస్ చేత విచారణ చేయించాలని నిర్ణయించడం వరకూ సబబే. ఎందుకంటే తాము చేసిన ఆరోపణల విషయంలో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి కమిషన్ ను ఏర్పాటు చేయడం వరకూ ఒకే. కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకున్నా పెద్దగా రాజకీయ ఇబ్బందులుండవు. ఎందుకంటే సుదీర్ఘమైన విచారణ జరిపిన తర్వాత జస్టిస్ పినాకీ ఘోష్ సుదీర్ఘంగా విచరాన జరుపుతున్నారు. అందరినీ పిలిచి వారి అభిప్రాయాలతో పాటు సందేహాలను కూడా తెలుసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ రాజకీయ ప్రేరేపితం కాదని ప్రజలు నమ్మే వీలుంది. కానీ ఏసీబీ కేసు విషయంలో మాత్రం కొంత ప్రజల్లో అనుమానాలు కలిగే ఆస్కారం ఉంది. మరోవైపు తెలంగాణలో ఎన్టీఆర్ వంద అడుగల విగ్రహానికి స్థలం ఇస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ కూడా ఒకింత పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశముందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ కు తెలంగాణ సెంటిమెంట్ ను రాజేయడానికి ఇది ఉపయోగపడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే దీనిపై రాజకీయ రగడ ప్రారంభమయింది. తెలంగాణ జర్నలిస్టులు కొందరు దీనిపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ విషయంలోనూ అందరి అభిప్రాయాలను తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఎన్టీఆర్ ను ఆంధ్రవాదిగా చూడరని, తెలుగు జాతికి కేరాఫ్ గా చూస్తారని రేవంత్ మంత్రులను, నేతలను ఒప్పించి భూమిని కేటాయిస్తే అది ఎంత వరకూ పార్టీకి లాభదాయకం? నష్టం? అన్న చర్చ జరుగుతుంది.

Related Posts