YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముందుకు రాని వైసీపీ నేతలు...

ముందుకు రాని వైసీపీ నేతలు...

విశాఖపట్టణం, డిసెంబర్  27 
వైసీపీ నుంచి జంప్‌ అయ్యే వాళ్లు జంప్ అయ్యారు. పార్టీలో ఉన్న నేతలు మాత్రం జెండా మోసేందుకు ఆసక్తి చూపడం లేదట. పార్టీ మారేందుకు దారులు వెతుకున్నా.. కూటమి పార్టీలు జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. పోనీ వైసీపీలోనే ఉండి కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామంటే.. తమను ఎక్కడ కార్నర్ చేస్తారో.. ఏ కేసులో అరెస్ట్ చేస్తారో..ఏ స్కామ్‌ను బయటికి తీస్తారో అని టెన్షన్ పడుతున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు.
ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తర్వాత మెల్లమెల్లగా కోలుకుంటోంది వైసీపీ. ఓ పక్క పార్టీలో నేతలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నా..నిత్యం ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా కొన్ని అంశాలపై పోరుబాటకు పిలుపునిచ్చింది వైసీపీ. అయితే అధినేత పిలుపునిచ్చిన కార్యక్రమాలపై పార్టీ నేతల నుంచి డిఫెరెంట్ ఓపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి.ఇటీవల వైసీపీ అధినేత మూడు అంశాలపై నిరసన కార్యక్రమాలకు పిలుపిచ్చినా.. నేతలు అంతగా రెస్పాండ్ అవ్వడం లేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడిపోయిన చాలామంది నేతలు అప్పుడే నిరసన కార్యక్రమాలు అంటే ఆసక్తి చూపడం లేదట. ఇప్పటికే కొందరు మాజీమంత్రులు, కీలక నేతలు, చాలామంది మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవైపు ఓటమి బాధ..మరోవైపు కేసుల భయంతో పార్టీ యాక్టివిటీస్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదట ఫ్యాన్ పార్టీ లీడర్లు.రైతు సమస్యలు, ధాన్యం కొనుగోలు, విద్యుత్ చార్జీల భారం, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ అధిష్టానం. అయితే ఈ నెల 13న జరిగిన ధాన్యం కొనుగోలు నిరసన కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో లీడర్లు, క్యాడర్ పార్టిసిపేట్ చేయలేదు. అక్కడక్కడ మాత్రమే ధర్నాలు చేశారు నేతలు. జిల్లా కేంద్రాల్లో జరిగిన నిరసనలకు పెద్దగా రెస్పాన్స్ రాలేదని వైసీపీ నేతనే చర్చించుకుంటున్నారు. బయటికి వచ్చిన కొందరు నేతలను పోలీసులు అరెస్టు విద్యుత్ భారంపై నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. దాంతో పాటు ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని జనవరి 3న ఆందోళన చేయబోతున్నారు. అయితే అప్పుడే నిరసనలు, ధర్నాలు అంటే ఎలా అంటూ లోలోపల గునుక్కుంటున్నారట పార్టీ నేతలు. ఒక పక్క ఓటమి ఎఫెక్ట్.. మరోవైపు కేసులు.. ఇలాంటి పరిస్థితుల్లో కార్యక్రమాలు అంటే కష్టం అంటున్నారట. గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి అర్థం చేసుకోకుండా నిరసనలకు పిలుపునివ్వడం సరికాదని ఒకరి దగ్గర ఒకరు గుసగుస పెట్టుకుంటున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు మాత్రమే అయింది. ఇంకా కొంత సమయం తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట కొందరు నేతలు..పార్టీ నేతలు ఎవరూ ఈ విషయాలను డైరెక్టుగా అధిష్టానం పెద్దలకు చెప్పే ప్రయత్నం చేయడం లేదు. వైసీపీ అధినాయకత్వం మాత్రం..నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఒత్తిడి తెస్తుంది. ఆరు నెలలు సమయం చాలా ఎక్కువ అని అంతేకాకుండా ప్రజలు ఈ మూడు అంశాలపై ఇబ్బందులు పడుతున్నారని..అపోజిషన్‌గా ఆందోళన నిరసనలు చేస్తే ప్రభుత్వంలో కదలిక వస్తుందని చెప్తున్నారట అధిష్ఠానం పెద్దలు. దీంతో అటు అధిష్టానం ఒత్తిడి ఇటు క్యాడర్ నుంచి సపోర్ట్ లేక, మరో పక్క కేసుల భయంతో సతమతం అవుతున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. చూడాలి మరి రాబోయే రెండు నిరసన కార్యక్రమాలకు..వైసీపీ క్యాడర్‌, లీడర్ల నుంచి ఏ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందో.

Related Posts