YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెరపైకి పరకామణి ఇష్యూ...

తెరపైకి  పరకామణి ఇష్యూ...

తిరుమల, డిసెంబర్ 27, 
తిరుమలలో జరిగిన లీలలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. అక్కడి ఓ ఉద్యోగి కన్ను శ్రీవారి హుండీపై పడింది. ఆ వ్యక్తి పెద్ద జియ్యంగార్ తరపున పని చేశాడట. ఏళ్ల తరబడి శ్రీవారి పరకామణిలో ఫారెన్ కరెన్సీ, నగలు  కొల్లగొట్టాడు. అతడ్ని పట్టుకున్న అధికారులు, అతడితో రాజీ పడినట్టు తెలుస్తోంది. చివరకు దొంగిలించిన మనీ ద్వారా కూడబెట్టిన ఆస్తులను కొంతమంది అధికారులు రాయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కరోనా సమయంలో జరిగిన ఈ వ్యవహారంపై చర్చ జరుగుతున్నా, ఇప్పుడు తారాస్థాయికి చేరింది. 2020-23 సమయంలో బంగారాన్ని ఎలాగైతే స్మగర్లు అక్రమ రవాణా చేస్తున్నారో, ఆ విధంగా శ్రీవారికి వచ్చిన విదేశీ కరెన్సీ (డైమండ్స్, అమెరికన్ కాయన్స్)ని నొక్కేశాడట సదరు ఉద్యోగి. హండీకి వచ్చిన డాలర్లను మూడో కంటికి తెలీకుండా గుట్టుచప్పుడు కాకుండా దొంగలించాడు. సిబ్బంది చెక్ చేసినా ఎక్కడా దొరికేవాడు కాడట. దొంగతనం చేసిన తర్వాత కడుపులో ఉన్న సొత్తును చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వాటిని తొలగించుకుని  వచ్చేవాడని చెబుతున్నారు. దొంగిలించిన డబ్బుతో భారీగా ప్రాపర్టీలను కొనుగోలు చేశాడు. చివరకు విజిలెన్స్ అధికారులకు ఆ వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఇంటిగుట్టు బయటపడింది. విజిలెన్స్‌లో సతీష్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. కొందరు టీటీడీ అధికారులు పోలీసులతో కుమ్మక్కై డీల్ సెట్ చేసుకున్నారన్నది ఫస్ట్ పాయింట్. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేయకుండా ఈ వ్యవహారాన్ని లోక్ అదాలత్‌కు తీసుకెళ్లారు. ఆయన దొంగలించిన ఆస్తుల్లో 70 లేదా 80 కోట్ల రూపాయలను టీటీడీకి విరాళం ఇచ్చినట్టు చేశారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. శ్రీవారికికి వచ్చిన డైమండ్స్, బంగారం రూపంలో వచ్చిన కానుకల విలువ దాదాపు 90 కోట్ల రూపాయలు ఉంటుందని ఓ అంచనా. ఓవరాల్‌గా 200 కోట్ల రూపాయల కానుకలు నొక్కేశాడు. ఆ మొత్తాన్ని కొందరు టీటీడీ అధికారులు, పోలీసులు, కొందరు వైసీపీ నేతలు రాయించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ జరిగిపించాలన్నది టీటీడీ బోర్డు భాను ప్రకాష్ ప్రధాన డిమాండ్.ఈ వ్యవహారాన్ని టీటీడీ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారాయన. ఇప్పుడు దీని చుట్టూనే తిరుగుతోంది. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానంటున్నారు. పరకామణి వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related Posts