- రెండు విడదల్లో బడ్జెట్ సమావేశాలు
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్.. ఎన్నికలకు ముందు రానున్న ప్రజాకర్షక బడ్జెట్.. ఇలా ఎన్నోవిశేషణాలను సొంతం చేసుకున్న బడ్జెట్-2018 మరో మూడు రోజుల్లో ప్రజల ముందుకు రానుంది. రేపటి(జనవరి 29) నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రాంరభంకానున్నాయి. ఫిబ్రవకి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర ప్రభుత్వం విడివిడిగా అన్ని పార్లమెంటరీ పక్షాల నేతలతో నేడు భేటీ కానున్నారు.ఆదివారం సాయంత్రం అన్ని పార్లమెంటరీ పార్టీల నాయకులతో స్పీకర్ భేటీ కానున్నట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. ‘సభ కార్యకలాపాలు సజావుగా సాగేలా సహకరించాల’ని పార్టీలను స్పీకర్ కోరనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతలోనూ ఆల్‌పార్టీ మీటింగ్ జరుగనుంది. ఆనవాయితీ ప్రకారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడంతో రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు మొదటి విడత, మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడతగా పార్లమెంట్ భేటీ కానుంది.