కాకినాడ
కూటమి ప్రభుత్వం ప్రజలపై పెంచిన విద్యుత్తు చార్జీలు భారాన్ని వెంటనే ఉపసహరించుకోవాలని కాకినాడ లో వైఎస్ఆర్సిపి నాయకులు, శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు... మాజీ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సిటీ వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఎస్సీ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ర్యాలీగా చేరుకొని కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం ఎస్సీకి వినతిపత్రం అందజేశారు...ఈనిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాకినాడ సిటీ,రూరల్ నియోజవర్గాలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు,శ్రేణులు పాల్గొన్నారు..
అమలాపురంలో విధ్యుత్ చార్జీలకు వైసీపీ నాయకులు ఆందోళన...
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పేదలపై మోపిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసారు. మాజీ మంత్రి పీనిపే విశ్వరూప్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలపై 15 వేల భారం మోపింది. గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు పధకాన్ని తీసేసింది. ఎస్సీ,ఎస్టీలకు 200 ఉచిత యూనిట్లు తక్షణమే కొనసాగాలని అన్నారు. ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జిలను తగ్గించాలని డిమాండ్ చేసారు.
18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు 1500 ఇస్తానన్న పథకాన్ని వెంటనే అమలు చేయాలని అమలాపురం మాజీ ఎంపీ అనురాధ అన్నారు.
విశాఖలో రోడ్డెక్కిన వైకాపా నేతలు
ఏపీలో వైసీపీ పోరు బాట పట్టింది.ఎన్నికల సమయంలో కరెంటు చార్జీలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆర్నెల్లలోనే 15,485.36 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కారుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు.దీంట్లో భాగంగా విశాఖలో మాజీ మంత్రి అమర్ తో పాటు వైసీపీ నేతలు రోడెక్కి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు కోట్ల రూపాయలకు పైగా భారాన్ని పేదలపై మోపారని అన్నారు.బాబు షూరిటీ బాదుడి గ్యారెంటీ అనే తరహాలో చంద్రబాబు పాలన ఉందని చెప్పారు.