YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు తలనొప్పిగా మారుతున్న షర్మిళ

జగన్ కు తలనొప్పిగా మారుతున్న  షర్మిళ

కడప, డిసెంబర్ 28, 
జగన్‌ సొంత పార్టీని రక్షించుకోవడమే పెద్ద టాస్క్‌గా మారిందాయనకి. పార్టీని వీడుతున్న కీలక నేతల్ని నియంత్రించలేక పోతున్న జగన్.. ఆఖరికి కడప కార్పొరేటర్లను కాపాడుకోవడానికి స్వయంగా బుజ్జగింపులకు దిగుతున్నారు.బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్రభుత్వం ఏపీలో అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకెళ్తోంది. కేంద్రం స‌హ‌కారంతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. అదే సమయంలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో అరాచ‌క పాల‌న సాగించిన వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్‌కి వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. జ‌గ‌న్ వెంట ఉంటే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్యత్ ఉండ‌ద‌ని భావించిన వైసీపీ కీల‌క నేత‌లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లోకి క్యూ క‌డుతున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌లోపేతంపై కీల‌క నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమ‌వుతున్నారు. జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు గుప్పిస్తూ.. వైసీపీకి షిఫ్ట్ అయిన కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుని తిరిగి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల దూకుడు వైసీపీకి మరింత మైనస్‌గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే త‌న చెల్లి ష‌ర్మిల‌ దూకుడుకు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ప్రయ‌త్నాలు ఆరంభించారంట. ముఖ్యంగా ఆమెను పీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు ఢిల్లీలో తనకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పెద్దల‌తో మంత‌నాలు చేస్తున్నట్లు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో ఏపీ కాంగ్రెస్ లో ఒక‌రిద్దరు సీనియ‌ర్ నేత‌ల‌కు వైసీపీ కండువా క‌ప్పి ష‌ర్మిల‌కు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ప్రయ‌తనిస్తున్నారంట2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డంలో ష‌ర్మిల కీల‌కపాత్ర పోషించారు. అయితే, సీఎంగా జ‌గ‌న్‌ బాధ్యత‌లు చేప‌ట్టిన త‌రువాత ష‌ర్మిల‌ను ప‌క్కన పెట్టేశారు. ఆస్తుల విష‌యంలోనూ వారిమ‌ధ్య వివాదాలు త‌లెత్తాయి. ఆ క్రమంలో ష‌ర్మిల తెలంగాణ‌లో సొంత రాజ‌కీయ పార్టీ పెట్టుకున్నారు. కొద్దికాలానికే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన ష‌ర్మిల‌.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఏపీ రాజ‌కీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు నుంచి జ‌గ‌న్‌ని టార్గెట్ గా చేసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ భారీ ఓట‌మికి షర్మిల కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ, ఎన్నిక‌ల త‌రువాత కూడా జ‌గ‌న్ టార్గెట్ గా ష‌ర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ఆ కుటుంబ ఆస్తి వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. షేర్లకు సంబంధించి తల్లి, చెల్లిపై జగన్ కేసు పెట్టి అందరిలో అభాసుపాలయ్యారుఇన్నాళ్లు ష‌ర్మిల విష‌యాన్ని పెద్దగా ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. ఇప్పుడు ఆమె పేరు చెబితేనే భ‌య‌ప‌డుతున్నారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. దీంతో ష‌ర్మిల దూకుడుకు చెక్ పెట్టేలా పావుల‌ను క‌దిపేందుకు జ‌గ‌న్ సిద్ధమైన‌ట్లు తెుస్తోంది. ఏపీ కాంగ్రెస్ లో ష‌ర్మిల నాయ‌క‌త్వంపై అసంతృప్తితో ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌ను జ‌గ‌న్ వైసీపీలోకి ఆహ్వానించారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది‌. షర్మిల నాయకత్వంపై కొంత‌కాలంగా సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమె తీరు, వ్యవహారశైలిపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేశారంట. షర్మిల పార్టీ బలోపేతం కంటే తన వ్యక్తిగత అంశాల కోసం పార్టీని వాడుకుంటున్నార‌ని, ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర పార్టీ పెద్దల‌కు ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు. జగన్ కాంగ్రెస్ పెద్దల్లో తనకు అనుకూలంగా ఉన్నవారి ద్వారా ష‌ర్మిలను పీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు ప్రయ‌త్నిస్తున్నారంట. దివంగ‌త‌ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ముఖ్య అనుచ‌రులుగా కొన‌సాగిన నేత‌లు కొంద‌రు ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొన‌సాగుతున్నారు. వారంద‌రితో ఇటీవ‌ల‌ జ‌గ‌న్ ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల‌ కర్నూలులో ఒక వివాహ రిసెప్షన్‌కు జ‌గ‌న్‌, వైసీపీ నేతలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వారిలో పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ ఉన్నారు.శైలజానాధ్, జ‌గ‌న్ ఒక‌రినొక‌రు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. కొద్ది సేపు విడిగా ముచ్చటించుకున్నారు. ఆక్రమంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై వారిద్దరి మ‌ధ్య చ‌ర్చ జరిగిందని తెలుస్తోంది. అయితే, అంత‌కుముందే వైసీపీలో చేరే విష‌యంపై జ‌గ‌న్‌, శైలజానాథ్ మ‌ధ్య సంప్రదింపులు జ‌రిగాయ‌న్న ప్రచారం ఉంది. ఎన్నికల ముందే శైలజానాథ్ వైసీపీలో చేరతారన్న టాక్ వినిపించింది. అదే సమయంలో శైలజానాథ్ టీడీపీ వైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు . మళ్లీ ఇప్పుడు శైలజానాథ్ ప్రస్థానంపై ప్రచారం మొదలైంది. సమీప కాలంలో శైల‌జానాధ్ తోపాటు మ‌రో ఎనిమిది మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంట.వైసీపీలో ఉన్న వారిలో చాలా మంది కాంగ్రెస్ నాయ‌కులేన‌ని చెప్పడం ద్వారా.. త‌న ఎంట్రీ విష‌యంపై.. శైలజానాథ్ ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు.. 23 సీట్లే వ‌చ్చిన టీడీపీ తిరిగి అధికారంలో కి వ‌చ్చింది క‌దా.. అని పేర్కొన్న ఆయ‌న 11 సీట్లు వచ్చిన వైసీపీకి పాజిటివ్‌గా మాట్లాడారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. శైలజానాథ్ వైసీపీలో చేరిక ఖాయమైందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.మ‌రోవైపు ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ బ‌లోపేతంపై దృష్టిపెట్టిన రాహుల్ గాంధీ.. తాజా ప‌రిణామాల‌పై సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమ్మకమైన ముఖ్యనేత‌ల ద్వారా తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి‌. ఏపీలోని ఓ సీనియ‌ర్‌ నేత‌, తెలంగాణ‌కు చెందిన ఓ కీల‌క నేత ఏపీ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు, పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై ఎప్పటిక‌ప్పుడు రాహుల్‌కు నివేదిస్తున్నారని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

Related Posts