YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గంజాయి అమ్ముతూ పట్టుబడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్

గంజాయి అమ్ముతూ  పట్టుబడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్

కూకట్ పల్లి
కూకట్పల్లి ప్రాంతంలోని వసంత నగర్ బస్ స్టాప్ లో భరత్ రమేష్ బాబు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ ఎక్సైజ్  ఎస్టిఎఫ్ పోలీసులకు శుక్రవారం పట్టుబడ్డాడు.  ఖమ్మం ప్రాంతానికి చెందినటువంటి మూడు సంతోష అనే వ్యక్తి తరచూ ఖమ్మం నుంచి గంజాయిని తీసుకువచ్చి రమేష్ బాబుకి ఇచ్చి అమ్మకాలు జరిపిస్తూ ఉంటాడు. శుక్రవారం కూడా ఖమ్మం నుంచి తీసుకు వచ్చినటువంటి గంజాయిని రమేష్ బాబుకి ఇస్తున్న సమయంలో ఎస్ టి ఎఫ్ పోలీసులు పట్టుకున్నారు.  ఖమ్మం నుంచి గంజాయిని తీసుకువచ్చిన మూడు సంతోష్ మాత్రం గంజాయి ఇచ్చి దొరక్కుండా పరారయ్యాడు.  గంజాయి అమ్మకాలను చేపడుతున్న భరత్ రమేష్ బాబు మాత్రం ఎస్టిఎఫ్ సిఐ నాగరాజు సిబ్బంది పట్టుకున్నారు.  నిందితుడి వద్ద 1.1 కేజీల గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  గంజాయిని గంజాయి పట్టుకున్న టీం లో సీఐ నాగరాజు తో పాటు ఎస్ఐ జ్యోతి,హెడ్ కానిస్టేబుల్ అలీమ్, కానిస్టేబుళ్లు  శశికిరణ్ కార్తీకులు ఉన్నారు.

Related Posts