YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ట్విస్టులే..ట్విస్టులు

ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ట్విస్టులే..ట్విస్టులు

నిజామాబాద్, డిసెంబర్  28, 
కామారెడ్డిలో ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ట్రయాంగిల్ సూసైడ్ ఇష్యూలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఎస్‌ఐ, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మిస్సింగ్, సూసైడ్ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. భిక్కనూరు ఎస్సై సాయి కుమార్, బీబీపేట పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్‌ అనే యువకుడు ఒకేసారి కనిపించకుండా పోయారు. వీరిలో శ్రుతి, నిఖిల్ మృతదేహాలను సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువులో గుర్తించారు. కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, లేడీ కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్‌ రెండ్రోజుల క్రితం అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువులో శవాలై తేలిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు నీళ్లలో మునగడంతోనే చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. నీటలో ఊపిరాడక మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ముగ్గురి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికల్లో వెల్లడైనట్లు తెలిసింది. అయితే, ముగ్గురూ కలిసే చనిపోయారా? లేకుంటే ఒకరు సూసైడ్‌కు ప్రయత్నిస్తే కాపాడేందుకు యత్నించి మిగిలిన ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారా..? అనే విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.చెరువు కట్టపై దొరికిన సెల్‌ఫోన్లే ఈ కేసులో కీలకంగా మారాయి. ముగ్గురి సెల్‌ఫోన్లు ఈనెల 25న మధ్యాహ్నం 1.26 గంటలకు స్విచాఫ్‌ అయినట్లు నిర్ధారించారు. అదే సమయంలో నీటిలో మునిగి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. వారి కాల్‌డేటా, వాట్సప్‌ చాటింగ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రుతి, నిఖిల్‌ల మధ్య సూసైడ్‌పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 'నేను సూసైడ్ చేసుకుంటానంటే... నేను చేసుకుంటానని.. కాదు కాదు ఇద్దరం కలిసే చేసుకుందాం' అంటూ ఇరువురి మధ్య ఆత్మహత్యపై చాటింగ్‌ ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ ఎస్సై సాయి కుమార్‌తోనూ పలు విషయాలపై చర్చించినట్లు తెలిసింది.ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు, కీలక ఆధారాలు లేకపోవడంతో సాంకేతికత సాయంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. భిక్కనూరు పీఎస్ నుంచి అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వరకు దారి పొడవున ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఎస్సై సాయి కుమార్‌ చెందిన మూడు సెల్‌ఫోన్లలో రెండు అన్‌లాక్‌ కాలేదని వెల్లడించారు. అన్‌లాక్‌ అయిన ఫోన్‌లోని వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2018 బ్యాచ్‌ పోలీసుల నుంచి ఎస్సై సాయికుమార్‌ నడవడికపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఆయన భార్య మహాలక్ష్మి, తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు.ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి వరకు గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి శ్రుతి, నిఖిల్‌ మృతదేహాలను బయటకు తీశారు.ఎస్‌ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఎస్‌ఐ భార్య పుట్టింటికెళ్లిపోయిందని, అప్పటి నుంచి ఎస్‌ఐ ఫ్యామిలీలో ఘర్షణలు మొదలైట్లు స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. అయితే కానిస్టేబుల్‌తో విషయం తేల్చుకోవాలని ఎస్‌ఐకి భార్య కండీషన్ పెట్టిందని, దీంతో ఆ విషయం మాట్లాడుకునేందుకు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి వచ్చినట్లు తెలిపారు. ఎస్‌ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ సమస్య పరిష్కారం కాకపోవడంతో ముందుగా కానిస్టేబులో చెరువులో దూకింది. ఆ వెంటనే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ దూకడంతో.. భయపడి ఎస్‌ఐ కూడా చెరువులో దూకేశాడని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు ఒకేసారి మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా సంచలంగా మారింది. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Related Posts