YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్శించిన ఎంపి ఈటల

కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్శించిన ఎంపి ఈటల

సికింద్రాబాద్
బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ సందర్శించారు. ఆసుపత్రిలో పలు విభాగాలలో తిరుగుతూ వైద్యులతో, వార్డులలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ ఆసుపత్రిలో వైద్యుల, సిబ్బంది మందుల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని ఈ అంశాన్ని కంటోన్మెంట్ బోర్డులో ప్రస్తావించి వైద్యుల సంఖ్యను పెంచడంతోపాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో వైద్యులు ఉన్నప్పటికీ సరైన వైద్యం అందించడం లేదని ఆరోపణలు ఉన్నాయని అన్నారు. రానున్న రోజుల్లో వైద్యులు వైద్య సదుపాయాలు పరికరాల సంఖ్యను పెంచడంతోపాటు మెరుగైన వైద్య సదుపాయాలు చికిత్సలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. కంటోన్మెంట్ తో పాటు సమీప ప్రాంత ప్రజలకు మీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

Related Posts