విశాఖపట్నం
విశాఖ సాగర తీరంలో తూర్పు నౌకాదళం సాహస విన్యా సాల ప్రదర్శన అట్టహాసంగా జరి గింది. ఈ నెల 4వ తేదీన ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఎదు ట విన్యాసాల ప్రదర్శన జరగనుం ది. దీనికి రిహార్సల్గా అన్నిరకాల విన్యాసాలు ప్రదర్శిం చారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన లేజర్ షో, డ్రోన్ల ప్రదర్శన నగర వాసులను అలరించాయి. ఆకాశంలో ఎగురు తున్న హెలికాప్టర్ నుంచి పారా చ్యూట్ సాయంతో కిందకు సురక్షితంగా దిగే విన్యాసాలను ప్రదర్శించారు.గత కొద్ది రోజులుగా జరుగుతున్న రిహార్సల్స్ ను ప్రజలు ఆశక్తికరంగా తిలకించారు.