కాకినాడ
కొత్త సంవత్సరం,సంక్రాంతి నేపథ్యంలో కాకినాడ సముద్ర తీరానికి పెద్దఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారని,తీరంలో భద్రతకోసం పోలీసు సిబ్బందిని పెంచుతున్నామని కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కాకినాడ సూర్యారావు పేట వద్ద సముద్రంలో ప్రమాదాల నివారణ చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.సంక్రాంతి సెలవులు అయ్యేవరకు 14 మంది భద్రత సిబ్బంది చర్యల్లో పాల్గొం టారని సీఐ తెలిపారు.