YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రి భాయ్ పూలే జయంతి

మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రి భాయ్ పూలే జయంతి

హైదరాబాద్
సావిత్రి బాయ్ పూలే జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం పట్ల యావత్ బహుజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, దళిత్ బహుజన స్టూడెంట్ అసోసియేషన్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు  జంపాల రాజేష్ అన్నారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. 200 సంవత్సరాల క్రితం సావిత్రిబాయి పూలే చేసిన సేవలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం గర్వకారణం అన్నారు. మహిళా అక్షరాస్యత కోసం పాటుపడిన మొట్టమొదటి మహిళ అని కొనియాడారు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో ప్రచురించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Related Posts