హైదరాబాద్
ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ జల మండలి బోర్డుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. న సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు తదితరులు హజరయ్యారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరాకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. హైదరాబాద్ మహానగరంలో వినియోగదారులకు సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేసే ప్రణాళికలపై చర్చ జరిపారు.