YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కెసిఆర్ తో పాటు హరీష్ రావు కూడా జైలుకి వెళ్లాల్సిందే

కెసిఆర్ తో పాటు హరీష్ రావు కూడా జైలుకి వెళ్లాల్సిందే

జనగామ
చిల్పూర్ మండలం మల్కాపూర్ లో గ్రామస్తులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అయన  కల్వకుంట్ల కుటుంబం, మాజీ ఎమ్మెల్యే రాజయ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కల్వకుంట్ల కుటుంబం పది సంవత్సరాల పాలనలో... కొత్త రకమైన అవినీతికి తెరలేపింది. సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ.. లిక్కర్ కుంభకోణంలో ఎన్ని రోజులు తీహార్ జైల్లో ఉందో అందరికీ తెలిసిందే. రేపో, మాపో ఫార్ములా ఇ రేసులో కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తికాగానే... కెసిఆర్ తో పాటు హరీష్ రావు కూడా జైలుకి వెళ్లాల్సిందేనని జోస్యం చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం వివిధ కేసుల్లో ఇరుక్కుని.. కొందరు జైలు ఊచలు లెక్కపెట్టి వస్తే. మరికొందరు జైలు ఊచలు లెక్క పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి 2014 కు ముందు ఉన్న ఆస్తులు... ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంతో ప్రకటించాలి. దళిత బందులో కమిషన్ తీసుకున్నవారు.. నీతులు మాట్లాడడం హాస్యాస్పదం. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు నీతులు మాట్లాడడం విడ్డూరం. కడియం శ్రీహరి తప్పు చేస్తే ఆధారాలు చూపించండి. ఇకనైనా సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు.

Related Posts