YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దళిత ద్రోహి కడియం శ్రీహరి

దళిత ద్రోహి కడియం శ్రీహరి

జనగామ
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. కడియం శ్రీహరి నీది నాలుక తాటి మట్ట. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా. పది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబాన్ని పొగిడిన వ్యక్తివి నువ్వు కాదా. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది  రేవంత్ రెడ్డి సానుభూతి పొందడానికేనా. కవితను అరెస్టు చేసిన రోజు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసింది నువ్వు కాదా. నువ్వు చేసిన మోసానికి బీఆర్ఎస్ వాళ్లే కాదు...  కాంగ్రెస్ వాళ్లు కూడా తూ..తూ అంటున్నారని మండిపడ్డారు.
ఇంకోసారి కెసిఆర్ కుటుంబం గురించి మాట్లాడితే ఖబడ్దార్. నియోజకవర్గంలో 1100 మందికి.. దళిత బంధు రాకుండా అడ్డుకున్న వ్యక్తి కడియం శ్రీహరి. దళిత ద్రోహివి , దళితుల పాలిట రాబందు కడియం. టిడిపిలో , బీఆర్ఎస్ లో మంత్రి పదవులు అనుభవించి, అక్రమ ఆస్తులు సంపాదించుకున్నది నిజం కదా..? 1994లో నీ ఆస్తులు ఎన్ని , ఇప్పుడు నీ ఆస్తులు ఎంత? అవినీతితో సంపాదించుకున్న వాడు ఎవడైనా సాక్షాలు పెట్టుకుంటాడా. నీ ఇల్లు, నీ పెట్రోల్ బంకు, దేవునూరు భూములు, విదేశాలలో ఉన్న నీ ఆస్తులన్నీ సాక్ష్యం కాదా అని ప్రశ్నించారు.

Related Posts