YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పార్టీకి, పదవికి ట్రూడో రాజీనామా

పార్టీకి, పదవికి ట్రూడో రాజీనామా

న్యూఢిల్లీ, జనవరి 7, 
 కొద్ది గంటల ఊహాగానాల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో  లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన పదవికి, లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకూ ఆయన ప్రధానిగా కొనసాగనున్నారు. ఈ క్రమంలో ఆ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగుతానని ట్రూడో చెప్పారు. ఆయన రాజీనామాతో దాదాపు 10 ఏళ్ల అధికారానికి ముగింపు పలికినట్లవుతుంది. కాగా.. దేశవ్యాప్తంగా ట్రూడోపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవడంతో.. లిబరల్ పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల నుంచి కొంతకాలంగా డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు.

Related Posts