YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏసీబీ విచార‌ణ‌కు కేటీఆర్ లాయ‌ర్‌ను తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమ‌తి

ఏసీబీ విచార‌ణ‌కు కేటీఆర్ లాయ‌ర్‌ను తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమ‌తి

హైద‌రాబాద్  జనవరి 8
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు విచార‌ణ ప్రారంభం కాగా.. ఏసీబీ విచార‌ణ‌కు కేటీఆర్ లాయ‌ర్‌ను తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. కేటీఆర్ వెంట వెళ్లేందుకు ముగ్గురు న్యాయ‌వాదుల పేర్ల‌ను సూచించాల‌ని కోర్టు అడిగింది. ముగ్గురిలో ఒక‌రిని కేటీఆర్ వెంట వెళ్లేందుకు అనుమ‌తిస్తామ‌ని న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. త‌దుప‌రి విచార‌ణ‌ను సాయంత్రం 4 గంట‌ల‌కు వాయిదా వేశారు.కేటీఆర్ లంచ్ మోష‌న్ పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా.. కేటీఆర్‌తో న్యాయ‌వాదిని అనుమ‌తించాల‌ని అడ్వ‌కేట్ ప్ర‌భాక‌ర్ రావు వాదించారు. గ‌తంలోనూ లాయ‌ర్ అనుమ‌తికి సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చిందని కేటీఆర్ న్యాయ‌వాది ప్ర‌భాక‌ర్ రావు గుర్తు చేశారు. అవినాష్ రెడ్డి విచార‌ణ సంద‌ర్భంగా ఇదే హైకోర్టు న్యాయ‌వాదికి అనుమ‌తి ఇచ్చింద‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.ఏసీబీ త‌ర‌పున అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ర‌జ‌నీకాంత్ రెడ్డి వాద‌న‌లు వినిపించారు. కేటీఆర్ వెంట న్యాయ‌వాదిని అనుమ‌తించొద్దంటూ అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ వాదించారు. న్యాయవాదిని అనుమ‌తిస్తే స‌మ‌స్య ఏంట‌ని ఏఏజీని న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించారు.

Related Posts