YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోకేష్... ఇమేజ్... భారీగానే పెరిగిందే

లోకేష్... ఇమేజ్... భారీగానే పెరిగిందే

విజయవాడ, జనవరి 9, 
మొన్నటి వరకు నారా లోకేష్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు. కనీసం ఆయనను నేతగా అంగీకరించని పరిస్థితి. కానీ నేడు ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ అందరి నోట నానుతున్నారు. ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా తెలంగాణ బిజెపి తమ పోస్టర్లలో ముఖ్య నాయకుల ఫోటోలను ముద్రించింది. అందులో లోకేష్ కు స్థానం దక్కింది. అగ్ర నేతలతో పాటు లోకేష్ ఫోటోలు కూడా వేయడం ఆకర్షించింది. బిజెపి అగ్ర నేతలుగా ఉన్న ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీఏ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటుగా లోకేష్ ఫోటోలు కూడా ప్రచురించారు. ప్రధాని పర్యటన సందర్భంగా తాజాగా విశాఖలోసైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో సైతం.. అగ్రనేతల సరసన లోకేష్ ఫోటో కనిపించడం చర్చకు దారితీసింది. ప్రధాన మోడీకి స్వాగతం పలుకుతూ ముద్రించిన ఫ్లెక్సీలలో ప్రధాని మోదీకి ఒకపక్క పవన్ ఉండగా.. మరోపక్క చంద్రబాబుతో పాటు లోకేష్ ఉన్నారు. ఇన్ని రోజులు కూటమి నేతలుగా చంద్రబాబు, పవన్, పురందేశ్వరి మాత్రమే ఉండేవారు. అటువంటిది ఇప్పుడు వారందరి సరసన లోకేష్ స్థానం దక్కుతుండడం విశేషం.ఈ ఎన్నికలకు ముందు లోకేష్ పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి చర్చిస్తే.. కనీసం ఆయన నాయకుడు అన్న విషయాన్ని మరిచిపోయి రెచ్చిపోయేది వైసిపి ఆయన ఒక ఫెయిల్యూర్ నాయకుడిగా సంబోధించేది. గత ఐదేళ్లలో టిడిపి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. చంద్రబాబు అరెస్టు తో పాటు కొన్ని ఇతర సందర్భాల్లో కూడా లోకేష్ నాయకత్వం స్పష్టంగా బయటకు వచ్చింది. ఆ సమయంలో కేంద్ర పెద్దల సాయాన్ని కోరుతూ ఏకంగా ఢిల్లీ వెళ్లారు లోకేష్. అంతకుముందు ఏపీలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. నాటి వైసిపి సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేయలేదు. సంయమనంతో ముందుకు సాగారు. పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు.ఏపీలో కూటమిపై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కూటమిలో పవన్తో పాటు లోకేష్పాత్ర పై ప్రత్యర్థులు రకరకాల ప్రచారం చేస్తున్నారు. లోకేష్ విషయంలో జనసేన నుంచి అభ్యంతరాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. లోకేష్ పవన్ విషయంలో ప్రత్యేక గౌరవంతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎదురుపడిన పవన్ కళ్యాణ్ సాదరంగా స్వాగతం పలికారు. ఆత్మీయంగా అలింగనం చేసుకున్నారు. అయితే లోకేష్ విషయంలో జనసేన అభిప్రాయం అంటూ ప్రత్యర్థులు దిగిన విమర్శలు, ప్రచారం ఉత్తనేనని తేలిపోయింది.అయితే మొన్నటికి మొన్న తెలంగాణ బిజెపి సైతం లోకేష్ కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం విశేషం. అసలు తెలుగుదేశం పార్టీతో తెలంగాణలో బిజెపికి అస్సలు సంబంధాలు లేవు. అయినా సరే అక్కడ ఫ్లెక్సీలలో లోకేష్ కు చోటు దక్కిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు, పవన్ అంటే ఎన్ డి ఏ పక్ష నేతలు. కానీ వారి సరసన లోకేష్ ను గుర్తించారంటే ఆయన ఎంత గానో ప్రభావం చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు, ప్రధాని మోదవిశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ల్లో సైతం లోకేష్ కనిపిస్తున్నారు. చివరకు ప్రధాన పత్రికలతో పాటు మీడియాకి ఇచ్చిన యాడ్స్ లో సైతం ఆ ముగ్గురు నేతల సరసన లోకేష్ ఫోటో కనిపిస్తుండడంతో టిడిపి శ్రేణుల్లో జోష్ నెలకొంది.

Related Posts