తిరుపతి
తొక్కిసలాటలో 40 మంది గాయపడ్డారు. 28 మందిని రుయా ఆసుపత్రికి తరలించారు.12 మందిని సిమ్స్ ఆస్పత్రికి తరలించారని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడించారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 28 మందిలో నలుగురు, సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిలో ఇద్దరు మృతి చెందారు. మృతిచెందిన ఆరుగురిలో ఐదు మంది మహిళలు ఉండగా ఒకరు మాత్రమే పురుషుడు. ఇరువురిని మాత్రమే గుర్తించడం జరిగింది. మరో నలుగురిని చిరునామా తెలియాల్సి ఉందని అయన అన్నారు.తిరుపతి తొక్కిసలాట క్షతగాత్రుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెంబర్: 08772236007.