శ్రీకాకుళం
ఇటీవల కాలంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. బుధవారం రాత్రి 10:50 గంటలకు, గురువారం తెల్లవారుజామున 4:56 గంటలకు ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. 2022లో జనవరి 4 నుంచి 12వ తేదీ వరకూ ఆరుసార్లు, గతేడాది ఆగస్టులో రెండు సార్లు ప్రకంపనలు సంభవించాయి.