హైదరాబాద్
తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికి, గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి మీలా దొరికిపోయిన దొంగను కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడాతూ నేను అరపైసా అవినీతి కూడా చేయలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నించాం. మీలా బావమరుదులకు కోట్లాది రూపాయల కాంట్రాక్ట్లు మేం కట్టబెట్టలేదు. నిజం నిలకడమీద తెలుస్తుందని అన్నారు.
420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం. వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలపై మాకు గౌరవం ఉంది. మేం నిజాయితీగా ఉంటాం, మీలా నీచపు పనులు చేయలేదు. అవసరమైతే చస్తా తప్ప లుచ్చా పనులు చేయనని అన్నారు.