YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జై హనుమాన్ చిత్రంపై కోర్టులో కేసు దాఖలు

జై హనుమాన్ చిత్రంపై కోర్టులో కేసు దాఖలు

హైదరాబాద్
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న జై హనుమాన్ చిత్రంపై న్యాయవాది మామిడాల తిరుమల్ రావు నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. జై హనుమాన్ చిత్రం టీజర్లో హనుమంతుడిని కించపరిచే విధంగా దృశ్యాలు ఉన్నాయన్నారు. గత సంవత్సరం 2024 అక్టోబర్ 30న విడుదలైన టీజర్లో హనుమంతుని ముఖ చిత్రం బదులు నటుడు రిషబ్ శెట్టి మొహం చూపించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు హనుమంతుడు అంటే ఎవరో అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఈ అంశం హిందువుల మనోభావాలను దెబ్బతింటాయన్నారు. దీనికి బాద్యులుగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ , మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ , నటుడు రిషబ్ శట్టి లపై ఫిర్యాదు చేశామన్నారు.
నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టులో ఈ పిటిషన్ను స్వీకరించిందని... తదుపరి విచారణలో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. దీనితో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( CBFC) లో చిత్ర విడుదల నిలిపివేయాలని ఫిర్యాదు చేశామన్నారు. చిత్ర యూనిట్ వారి తప్పును సరిచేసి , రిషబ్ శెట్టి కు హనుమంతుడి మొఖం తో చిత్రాన్ని విడుదల చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

Related Posts