YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్ అరెస్ట్

హైదరాబాద్ జనవరి 9
;మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్ అరెస్ట్ అయ్యారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మునిసిపాలిటీలో పుప్పాల గూడ క్రిన్స్ విల్లాస్లో హరీష్ రావును పోలీసులు గృహ నిర్భంధం చేశారు. గురువారం మాజీ మంత్రి కెటిఆర్..ఫార్ములా ఈ రేస్ కేసులో ఎసిబి అధికారులు ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈక్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఉద్రిక్తత ఘటనలు జరగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయమే ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.కాగా, నిన్నబిఎల్ఎన్ రెడ్డిని ఎసిబి విచారించారు. దాదాపు 9 గంటలపాటు విచారించిన అధికారులు.. పలు ప్రశ్నలు సంధించారు. ఫ్మార్ముల ఈ-కార్‌ రేసు కేసులో కీలక సూత్రధారిగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి.. రూ.55 కోట్ల నిధులను ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే ఎఫ్ఈఓకు బదిలీ చేశారు. అయితే, అప్పటి మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు బదిలీ చేసినట్లు ఆయన ఎసిబి అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.

Related Posts