వెర్సటైల్ స్టార్ సూర్య హైలీ యాంటిసిపేటెడ్ 'రెట్రో' కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, సుబ్బరాజ్‌ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. ఇటివలే రిలీజ్ చేసిన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో సూర్య ఫెరోషియస్ గ్యాంగ్‌స్టర్ అవతార్ మెస్మరైజ్ చేసింది.తాజాగా మేకర్స్ రెట్రో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 1న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సూర్య ఇంటెన్స్ అవాతర్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది.పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ మ్యూజిక్, మహ్మద్ షఫీక్ అలీ ఎడిటర్.రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్) సహా నిర్మాతలు.
నటీనటులు: సూర్య,పూజా హెగ్డే, జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్