YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

భక్తులతో కిటకిటలాడుతన్న వైష్ణావలాయాలు

భక్తులతో కిటకిటలాడుతన్న వైష్ణావలాయాలు

తిరుపతి,భద్రాచలం, జనవరి 10, 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో రద్దీ పెరిగింది. మరికాసేపట్లో వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్‌ తీసుకున్న భక్తులను అనుమతిస్తారు. పదిరోజులపాటు సాగే వైకుంఠద్వార దర్శనాల కోసం వేలాదిగా వస్తున్న భక్తులతతో తిరుమల కొండం కిక్కిరిసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మలయప్ప స్వామి స్వర్ణరథంపై దర్శనమిస్తారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాభయ్యాయి. ప్రసిద్ధ వైష్ణవాలయాల్లో ఉత్తరద్వారాలు తెరుచుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు క్యూ కట్టారు. శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఉత్తర ద్వారం నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనమిస్తున్నారు. మరోవైపు గోదావరి నదిలో శ్రీ సీతారామ చంద్రుల వారు, లక్ష్మణుడు, హనుమంతుడి సమేతంగా హంసవాహనంలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు రాములవారిని దర్శించుకున్నారు.యాదగిరిగుట్టలో గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నారు. ఉదయం 5:30 గంటలకు నుంచి స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ స్వామి వారికి గరుడు సేవత్సవం, తిరువీధిసేవ నిర్వహించనున్నారు.అటు, చిన తిరుపతిగా పిలిచే ఏలూరులోని ద్వారకా తిరుమలలో ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్నను భక్తులు దర్శించుకుంటున్నారు. ఉదయాన్నే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోవింద నామ స్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.

Related Posts